Ante Sundaraniki Teaser: కామెడీ తో చంపేశారుగా..నో డౌట్..హిట్ పక్కా..!!

ఈ మధ్య కాలంలో జనాలు సినిమాలో కామెడీ ఉంటేనే ఇష్టపడుతున్నారు. అది ఎంత పెద్ద హీతో అయినా సరే..ఆ సినిమా లో కమెడీ టైమింగ్ బాగుంటే బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చోపెడుతున్నారు. దానికి బెస్ట్ ఉదాహరణ DJ TILLU. ఎటువంటి అంచనాలు లేకుండా సినిమా రిలీజ్ అయ్యి.. సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా సిద్ధు కామెడీ టైమింగ్ బాగా పండింది. ఇక పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ బాక్స్ ఆఫిస్ వద్ద బొల్తా కొట్టింది. దానికి రీజన్స్ చాలానే ఉన్నాయి.

సో..దీని ని దృష్టిలో పెట్టుకుని.. నాచురల్ స్టార్ నానీ.. ఈసారి పక్క ప్లానింగ్ తో ..జనాలను పొట్ట చక్కలయేలా నవ్వించడానికి సిద్ధమైయాడు. యస్.. మనకు తెలిసిందే..నాని అంటే సుందరానికి అనే సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ బ్యానర్‌పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీనే ఈ అంటే సుందరానికి. సినిమా పేరు తోనే నవ్వించేసిన నాని..సినిమాలో ఇంకెంత నవ్విస్తారో అనుకున్న జనాలను ఏ మాత్రం నిరాశ పరచడు అని రీసెంట్ గా రిలీజ అయిన టీజర్ చూస్తేనే అర్ధమైపోతుంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా లో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం జూన్ 10న గ్రాండ్ గా ధియేటర్స్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా, హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. 2 నిమిషాల 16 సెక‌న్ల ట్రైల‌ర్ మొత్తం ఫ‌న్ రైడ్ గా సాగిపోయింది. ఈ సినిమా లో నాని ని మనం ఓ ఢిఫరెంట్ రోల్ లో చూడబోతున్నాం. కుటుంబంలో అందరు ఆడపిల్లలే..కానీ వంశానికి ఒక్కే ఒక్కడు వారసుడు..ఆయనే.. సుంద‌ర్ ప్ర‌సాద్. సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన బ్రాహ్మ‌ణ కుటుంబంలో పుట్టిన సుంద‌ర్‌పై.. అతి ప్రేమ‌తో ఓవర్ గారాభంతో ..కుటుంబం చూపించే ప్రేమ తో ఈ సినిమా సాగిపోతున్నత్లు తెలుస్తుంది. బ్రాహ్మ‌ణ కుటుంబంలో పుట్టిన కుర్రాడు ఓ క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమిస్తే.. ఇంట్లో ఎలాంటి పరిస్ధితులు ఎదురు అవుతాయి అని డైరెక్టర్ ఫుల్ కామెడీ జోనర్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. టీజర్ ప్రకారం చూసుకుంటే.. నాని ఖాతాలో మరో హిట్ పక్కా అని తెలుస్తుంది. మరి చూడాలి సినిమా ఎలా ఉంటుందో..?

Share post:

Popular