ఆ హీరోయిన్ మోజులో రాజీవ్.. సుమ ని అంత టార్చర్ చేశాడా..?

సుమ..పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గలగల ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. యాంకరింగ్ లో తనసైన స్టైల్ లో కొనసాగుతున్న ఈ సుమ కనకాల కు స్టార్ హీరోయిన్ కు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆల్ మోస్ట్ అన్ని తెలుగు ఛానెల్స్ లోను యాంకరింగ్ చేస్తూ ..మరో వైపు సినిమాల ఈవెంట్లు చేసుకుంటూ రెండు చేతులా బాగా సంపాదిస్తుంది అని అంటుంటారు ఇండస్ట్రీలో ఉండే జనాలు. సుమ యాంకరింగ్ అంటే నవ్వులే..అందరిని కలుపుకుంటూ సరదాగా మాట్లాడుతూ .. హెల్తీ పంచ్ లు వేస్తూ..షో ని టైం తెలియకుండానే నడిపించేస్తుంది. అందుకే చాలా మంది హీరోలు కావాలనే ఆమెను యాంకర్ గా బుక్ చేసుకుంటారు.

రీసెంట్ గా సుమ కొత్త అవతారం ఎత్తింది. ఇన్ని రోజులు బుల్లితెర ను ఏలేసిన సుమ ..ఇప్పుడు వెండి తెర పై తన లక్ ను పరిక్షీంచుకోబోతుంది. జయమ్మ పంచాయతీ అంటూ ఓ సినిమా చేసి..మనల్ని కామెడీ తో నవ్వించడానికి ..ఎమోషన్స్ తో ఏడిపించడానికి సిద్ధమైంది. మే 6 న ఈ సినిమా ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిల్లిజ్ అయిన లుక్స్ , పాటలు మంచి కామెంట్స్ ని సొంతం చేసుకున్నాయి. కాగా, రీసెంట్ గా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ అలీతో సరదాగా షో కి గెస్ట్ గా వచ్చింది.

ఈ క్రమంలో సినిమా గురించి మాట్లాడుతూనే తన వ్యక్తిగత విషయాల గురించి ఓపెన్ అప్ అయ్యింది. ఆ సమయంలోనే రాజీవ్ కు తనకు మధ్య వచ్చిన గొడవలు గురించి మాట్లాడుతూ అవి వాస్తవమే ..భార్య భర్తలు విడిపోవడం ఈజీనే..కానీ అమ్మనాన్నలు విడిపోవడం చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ తో సుమ గురించి కొన్ని పరసనల్ వార్తలు మీడియాలో వైరల్ గా మారాయి. అప్పట్లో సుమ భర్త రాజీవ్ కనకాలకు ఓ హూరోయిన్ తో ఎఫైర్ ఉందని.. ఆమె స్టార్ డైరెక్టర్ సినిమాలో కూడా నటించిందని.. ఇక రాజీవ్ తో కూడా ఓ సినిమా చేసిందని..ఆ సినిమా డిజాస్టర్ అయినా.. రాజీవ్ కు ఆమె అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది అని..ఆమె మోజులోనే రాజీవ్ సుమని కొన్ని రోజులు టార్చర్ చేశాడని..ఇక ఆ తరువాత బంధువుల సహాయంతో సుమ రాజీవ్ ని మళ్లి మార్చుకుందని..కానీ ఇప్పటికి వాళ్ళ మధ్య ఆ పాత గొడవలు అలానే ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా చేసిన సుమ కామెంట్స్ ఆ వార్తలు నిజమే అనిపిస్తున్నాయి అంటున్నారు నెటిజన్స్.

Share post:

Latest