రష్మిక కొత్త బాయ్ ఫ్రెండ్.. మంచి పార్టీనే పట్టిందిగా..?

నేషనల్ క్రష్ రష్మిక..యమ హాట్..టూ టాలెంటెడ్. ఇండస్ట్రీకి వచ్చిన చాలా అతి కొద్ది టైంలోనే స్టార్స్ సినిమాలో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకోవడమే కాకుండా.. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. మొన్న ఆ మధ్య వచ్చిన పుష్ప సినిమాలో రష్మిక పర్ ఫామెన్స్ ..అయితే అందరిని విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా నా సామీ అంటూ నడుమును తిప్పేస్తూ.. కుర్రాళ్ళ మతులు పోగొట్టింది. సినిమాలో బన్నీ తో సమానంగా ఆడిపాడింది. రెమ్యూనరేషన్ కూడా బాగానే పుచ్చుకుంటుంది.

ప్రజెంట్ రష్మిక తెలుగు, తమిళ, హీంది భాషలల్లో సినిమాలు చేస్తూ..బిజీ బిజీ గా ఉంది. ఈ క్రమంలోనే రష్మిక కు సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ గా మారింది. మనకు తెలిసిందే రష్మిక కు..రౌడీ హీరో విజయ్ దేవరకొండాకు మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ఇండస్ట్రీ కోడై కూస్తుంది. ఎప్పటికప్పుడు మా మాధ్య అలాంటిది ఏం లేదురా బాబోయ్ అని వాళ్లు చెప్పుతున్నా..లేదు కాదు మీ మధ్య అదేదో ఉంది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతున్నాయి. కానీ లాస్ట్ టైం విజయ్ అలాంటి ట్రోలర్స్ కు కూసింత గట్టిగానే చెప్పాడు.

దెబ్బకి రష్మిక – విజయ్ ల పై లవ్ -పెళ్లి న్యూస్ లకు ఫుల్ స్టాప్ పదింది. కానీ, రీసెంట్ గా అమ్మడు కొత్త బాయ్ ఫ్రెండ్ మ్యాటర్ మీడియా లో హైలెట్ అవుతుంది. బాలీవుడ్ బడా స్టార్ సన్ తో శ్రీవల్లి ప్రేమ లో ఉందట. అంతే కాదు.. ఈ జంట కలిసి తెగ తిరిగేస్తున్నారట. అబ్బాయి ఇంట్లో రష్మిక అంటే ఇష్టమే ఉన్నా.. రష్మిక సైడ్ వాళ్లే నో చెప్పుతున్నారట. ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్న రష్మిక కి అప్పుడే లవ్..డేటింగ్ అంటే కెరీర్ దెబ్బతినే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. పైగా బాలీవుడ్ లో పెళ్లి లు విడాకులు చాలా కామన్ అయిపోయాయి..చూస్తూ చూస్తూ బిడ్డ జీవితం నాశనం చేసుకుంటామా అంటున్నారట రష్మిక పేరంట్స్. కానీ, రష్మిక పట్టిన బిగ్ షాట్ ఫ్యామిలీ వారసుడి కి కళ్లు చెదిరే ఆస్తులు ఉన్నాయట. ఎంతలా అంటే.. రష్మిక ను పెళ్లి చేసుకుని వదిలేసిన..ఆయన ఇచ్చే భరణం తో రష్మిక లైఫ్ లాంగ్ లగ్జరీయస్ గా బ్రతికేయచ్చు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి రష్మిక ఏం చేస్తుందో చూడాలి..?