రష్మిక బిగ్ బాంబ్…కొంపముంచేసిందిరోయ్..!!

హీరోయిన్ రష్మిక..నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న ఈ సుందరి..ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ..బడా బడా హీరోల సరసన నటించి..మంచి మార్కులు కొట్టేసింది. అంతేకాదు..సోషల్ మీడియాలో స్టార్ హీరోకి తీసిపోని రేంజ్ లో ఫాలోవర్స్ ను పెంచుకుంది. అంతేనా..టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే..మరో వైపు బాలీవుడ్ లో మంచి మంచి అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీ..ఇప్పుడు కోలీవుడ్ లో కూడా పాగ వేసింది. అక్కడ కూడా స్టార్స్ సినిమాలో అవకాశాలు దక్కించుకుంటుంది.

కెరీర్ ని ఇంత బిజీ గా మల్చుకున్న రష్మిక.. బాలీవుడ్ స్టార్ హీరో సినిమాకి నో చెప్పింది. డైరెక్టర్స్ రిక్వెస్ట్ చేసిన సారీ అంటూ సైడ్ అయిపోయింది. మనకు తెలిసిందే టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన “జెర్సీ” మూవీని..హీందిలో కూడా తెరకెక్కించారు. ఇక్కడ నాన్ని నటిస్తే అక్కడ ఆ పాత్రలో షాహిద్‌ కపూర్ ఆ పాత్రను పోషించి..శభాష్ అనిపించుకున్నాడు. భావోద్వేగ సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయినప్పటికీ KGF 2 కారణంగా ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేకపోయింది. దీంతో సినిమా డిజాస్టర్ టాక్ అంటూ మీమ్‌స్ వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ సినిమా షాహిద్‌ భార్యగా బాలీవుడ్‌ నటి మృణాల్‌ ఠాకుర్‌ నటించింది. ఆమె నటన కూడా సినిమాకి బాగా సెట్ అయ్యింది. కానీ ఆమెకు అంత పాపులారిటి రాలేదు ఈ సినిమా ద్వారా. అయితే మేకర్స్ ముందు గా ఈ పాత్ర కోసం అనుకున్న హీరోయిన్ రష్మిక. ఈ విషయాని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. తాను జెర్సీ మూవీ ఆఫర్ ను ఎందుకు వదులుకున్నానో చెప్పుతూ రష్మిక..” నేను జెర్సీ సినిమా బాగోలేదు అని చెప్పడం లేదు. అది ఫీల్ గుడ్ ఎమోషన్స్ పండించే సినిమా. నేను ఇప్పటి వరకు ఇలాంటి పాత్ర చేయలేదు. నేను చేసినవన్ని కమర్షియల్ సినిమాలే. అండ్ ఈ పాత్రకు నేను సూట్ అవుతాను అని అనుకోవడం లేదు. జెర్సీ తెలుగు వెర్షన్‌లో నటించిన శ్రద్ధా శ్రీనాథ్‌ అద్భుతంగా నటించారు. ఆ పాత్రకు తనకన్న గొప్పగా ఎవరూ నటించలేరని నా ఉద్దేశం. అందుకే ఈ పాత్రకు నేను కరెక్ట్‌ కాదని అనిపించింది. నా వల్ల సినిమా మేకర్స్ నష్టపోకూడదు అనుకునే ..ఈ సినిమాను వదిలేసుకున్న”..అంటూ చెప్పుకొచ్చింది. దీంతో రష్మిక ఈ సినిమాని డిజాస్టర్ అనకనే పరోక్షంగా సినిమా ఫ్లాప్ అవుతుందని తెలుసు ఆ రీజన్ తో నే చెయలేదు అని మరోసారి గుర్తు చేసిన్నట్లైంది.

Share post:

Latest