వాళ్ల పై ఉమ్మేయాలి.. కీర్తి మాటలకు ఇండస్ట్రీ షాక్..ఎందుకంత కోపం..?

కీర్తి సురేష్ లో ఇంత కోపం ఉందా..? అస్సలు ఊహించలేదు..కీర్తి నోట ఇలాంటి మాటలు వినడం బాగోలేదు అంటున్నారు ఆమెను అభిమానించే ఫ్యాన్స్. కీర్తి సురేష్ అనగానే మనకు టక్కున గుర్తు వచ్చే పేరు..మహానటి. సావిత్రి గారిని చూడని వ్యక్తులకు కీర్తి నే ఓ మహానటిలా కనిపించింది. ఆ సినిమాలో కీర్తి పర్ ఫామెన్స్..బడా బడా స్టార్స్ ని సైతం ఆకట్టుకుంది. నిజానికి కీర్తి మహానటి లో నటించలేదు..జీవించేసింది.

ప్రతి రోల్ ను కీర్తి ఎంజాయ్ చేస్తూనే చేస్తుంది. కానీ, అన్నీ సినిమాలు ఆమెకు మంచి సక్సెస్ అందివ్వలేకపోయాయి. నిజం చెప్పాలంటే మహానటి సినిమా తరువాత కీర్తికి ఒక్కటి అంటే ఒక్కటి కూడా సినిమా హిట్ అవ్వలేదు సరికదా..కనీసం పాజిటీవ్ టాక్ ను కూడా దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా పైనే ఆమె అన్నీ ఆశలు పెట్టుకుని ఉంది. ప్రస్తుతం ఉన్న టాక్ ప్రకారం ఈ సినిమా ద్వారానే కీర్తి మరో హిట్ తన ఖాతాలో వేసుకోబోతుంది అంటున్నారు జనాలు.

అయితే, రీసెంట్ గా కీర్తి నటించిన మరో సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లోకి రానుంది. కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘సాని కాయిదం’. ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో ‘చిన్ని’ అనే పేరుతో డబ్ చేశారు. ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుంది. ప్ర‌ముఖ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు శ్రీ రాఘ‌వ‌న్ ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో నటిస్తుండటంతో సినిమా పై భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు అభిమానులు. ఈ సినిమా మే 6న డైరెక్ట్ గా అమెజాన్ లో రిలీజ్ అవుతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీసర్ లో కీర్తి సురేష్ కోపంగా డైలాగ్ లు చెప్పడం మనం చూడవచ్చు. ” మ‌న మీద ఉమ్మేస్తే మ‌న‌మూ ఉమ్మేయాలి.. అనే డైలాగ్ చెప్పుతూ.. మ‌న‌ల్ని కొడితే మ‌న‌మూ కొట్టాలి.. అంటూ రివేంజ్ తో రగిలిపోయే అమ్మాయిలా .. సినిమాలో ప‌గ తీర్చుకున్న‌ట్లు కనిపిస్తుంది. దీంతో కీర్తి సురేష్ నోటి నుండి ఇలాంటి మాటలు విన్న సినీ ఇందస్ట్రీ ప్రముఖులు షాక్ అవుతున్నారు. ఖచ్చితంగా ఈ సినిమాతో కీర్తి హిట్ కొడుతుందని అనుకుంటున్నారు. మరి చూడాలి సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో..?

Share post:

Popular