పెద్ద రిస్క్ చేస్తున్నావ్ ..జర జాగ్రత్త విజయ్ ..!!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండా.. ఒక్కే ఒక్క సినిమా తో తన పేరుని మారుమ్రోగిపోయేలా చేసుకున్నాడు. పెళ్ళి చూపులు సినిమాతో కుర్రాడు సైలెంట్ అనిపించుకున్న ఈ యంగ్ హీరో.. ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి తో తన జాతకానే మార్చేసుకున్నాడు. లిప్ కిస్ లతో..వల్గర్ డైలాగ్ లతో..చెలరేగిపోయాడు. అదేంటో తెలియదు.. బూతుపదాలు ఉంటే సినిమా ను హిట్ చేస్తున్నారు జనాలు. అలాంటి సీన్లు ఉంటేనే చూస్తారో..లేక జనాలు చూస్తున్నారు కదా అని డైరెక్టర్లు అన్ని చూయిస్తున్నారో తెలియదు కానీ.. మొత్తానికి అంతా చూయిస్తూ.. క్యాష్ ని క్రేజ్ ని వాడుకుంటున్నారు.

విజయ్ ఆ తరువాత గీతాగోవిందం సినిమా చేశాడు. అందులోను రష్మిక తో లిప్ లాక్ చేసి..మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫిస్ వద్ద మంచి విజయాని అందుకుంది. ఇక ప్రస్తుతం విజయ పూరీ డైరెక్షన్ లో “లైగర్” చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత పూరీ దర్శకత్వంలోనే జనగణమన అనే సినిమాకి కూడా ఫిక్స్ అయ్యాడు. ఇలా బ్యాక్ టూ బ్యాక్ పూరీ కాంబోలో సినిమాలు అంటే మాటలు కాదు.

అయితే, రీసెంట్ గా శివ నిర్వాణ డైరెక్షన్ లో మరో సినిమాకి కూడా కమిట్ అయ్యాడు విజయ్. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత అంటూ దాదాపు ఫిక్స్ అయిపోయారు జనాలు. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉందని..ఆ పాత్ర కోసం రష్మిక ను ట్రై చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. కాగా, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఖుషీ అనే టైటిల్ ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట టీం మెంబర్స్. అప్పుడేపుడో 23 ఏళ్ళ క్రితం ఖుషి సినిమాతో కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు పవన్. ఇప్పటికి ఈ సినిమా అంటే పడి చచ్చిపోయే జనాలు ఉన్నారు. మరి అలాంటి టైటిల్ ని పెట్టుకోవాలని చూస్తున్న విజయ్…ఆయన పేరు అందుకోకపోయిన పర్వాలేదు కానీ..చెడకొట్టకుండా ఉంటే చాలు అంటున్నారు పవన్ అభిమానులు. మరి చూడాలి విజయ్ పవన్ ఫ్యాన్స్ ని ఎలా మెప్పిస్తాడో..?

Share post:

Popular