ఆ ఇద్ద‌రు సీనియ‌ర్ మంత్రుల‌కు మ‌ళ్లీ నో ఛాన్స్‌… జ‌గ‌న్ దెబ్బ మామూలుగా లేదుగా..!

ఉగాదికి జ‌గ‌న్ కొత్త కేబినెట్ మ‌న ముందుకు రానుంది. ప్ర‌స్తుత మంత్రుల్లో ఒక‌రిద్ద‌రిని మిన‌హాయించి అంద‌రిని త‌ప్పించేస్తున్న‌ట్టు జ‌గ‌న్ ఇప్ప‌టికే క్లారిటీ ఇచ్చేశారు. కొత్త మంత్రులుగా ఎవ‌రెవ‌రు వ‌స్తార‌న్న దానిపై ఎవ‌రికి వారు ర‌క‌ర‌కాల లెక్క‌ల్లో మునిగి తేలుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే జ‌గ‌న్ షాకులు ఊహించ‌ని విధంగా ఉంటాయంటున్నారు.

ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఖ‌చ్చితంగా కేబినెట్లో ఉంటార‌ని అంద‌రూ అనుకుంటోన్న ఇద్ద‌రు మంత్రుల‌ను కూడా త‌ప్పించేయ‌బోతున్నార‌ట‌. ఆ మంత్రులు ఇద్ద‌రు కూడా జ‌గ‌న్ కేబినెట్లో కీల‌కంగా ఉన్న‌వారే.. సీనియ‌ర్లే.. వారే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌. ఇప్పుడు వైసీపీలో వినిపిస్తోన్న టాక్ ప్ర‌కారం వాళ్లిద్ద‌రిని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కొన‌సాగించే వాతావ‌ర‌ణం లేద‌ని.. జ‌గ‌న్ స్వ‌యంగా పిలిచి మీ ఇద్ద‌రిని మంత్రులుగా త‌ప్పిస్తున్నాన‌ని.. పార్టీ బాధ్య‌త‌లు తీసుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ అధికారంలోకి రావ‌డానికి కృషి చేయాల‌ని చెప్పిన‌ట్టుగా తెలుస్తోంది.

అయితే ఊహించ‌ని ఈ ప‌రిణామానికి అవాక్కైన పెద్దిరెడ్డి, బొత్స ఎంత చెప్పుకుందామ‌ని అనుకున్నా జ‌గ‌న్ ప‌ట్టించుకోలేద‌ట‌. జ‌గ‌న్ మ‌రోసారి అధికారంలోకి రావ‌డంపైనే ప్ర‌ధానంగా కాన్‌సంట్రేష‌న్ చేశారు. అందుకే పార్టీని బ‌లోపేతం చేయాలంటే పెద్దిరెడ్డి, బొత్స లాంటి వాళ్ల స‌హ‌కారం ఎంతో అవ‌స‌ర‌మ‌ని భావిస్తున్నార‌నేందుకు, వారికి వైసీపీ బాధ్య‌త‌ల్ని అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఇక కొడాలి నాని, పేర్ని నాని అయితే కంటిన్యూ అయ్యే అవ‌కాశాలే ఎక్కువు..?

Share post:

Popular