మీరు ఇలా పడుకుంటున్నారా..అయితే, మీ గత జన్మ రహస్యం తెలుసుకోండిలా ?

వినడానికి విడ్డూరంగా ఉన్నా..చదివే వాళ్ళు నవ్వుకున్నా..ఇదే నిజం అంటున్నారు పలువురు నిపుణులు. జనరల్ గా చాలమందికి తెలుసుకోవాలని ఉంటుంది . మనం గత జన్మలో ఎలా పుట్టాం. మనిషిగానా ..లేక జంతువుగానా..? అసలు మనకు పూర్వ జన్మ గుర్తు వస్తుందా..? మనకి కూడా మగధీర రేంజ్ లో ఓ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుందా..? అసలు మనం పూర్వ జన్మలో ఎలా చనిపోయాం అంటూ ఇలా రక రకాల ప్రశ్నలు మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం .

అయితే, మనం నిద్రలో పడుకునే విధానం బట్టి..మనం పూర్వ జన్మలో ఎలాంటిదో తెలుసుకోవచ్చట. ఈ విషయాని పలువురు నిపుణులే స్వయంగా చెప్పుకురావడం గమనార్హం. అయితే మరి ఎందుకు ఆలస్యం …మీరు నిద్రలో ఎలా పడుకుంటారో తెలుసుకుని..మీ గత జన్మ రహస్యం తెలుసుకోండిలా..!!

* మీ రెండు చేతులు మీ గుండెల మీద కలిపి పెట్టుకుని నిద్రించే వాళ్లు పూర్వ జన్మలో యోగై ఉంటాడు.

* నిద్రలో రెండు చేతులని దిండు గా చేసి ఒక పాదం మీద ఇంకో పాదం పెట్టుకుని పడునే వాళ్లు పూర్వజన్మలో మంచి సాధకుడు అయి ఉంటాడు.

* విష్ణు మూర్తి శేష శయ్యపై పడుకున్నట్టు గా పడుకున్న వాడు విష్ణు వంశంలో పుట్టిన వాడు సర్వ శుభ లక్షణాలు కలవాడు అయి ఉంటాడు.

* పడుకున్నప్పుడు తలా, చేతులు, కాళ్ళు అస్తవ్యస్తం గా పెట్టుకొని పడుకొనే వాళ్ళు శుద్ధాత్మ కలవాళ్ళు కాదు.

* నిద్రలో గుండె మీద రెండు చేతులు నమస్కారం చేసే విధంగా పెట్టుకుని పడుకునే వాళ్ళు తన పూర్వ జన్మలో మంచి భక్తుడై ఉంటాడు.

* ఎడమ వైపుకి తిరిగి కాళ్లను రెండు చాపుకుని పడుకునే వాళ్ళు శ్రేష్టుడు. వాళ్లకి శాంత గుణం అధికంగా ఉం టుంది.

* చాలా మంది అబ్బాయిలకు బోర్లా పడుకోవడం అలవాటు. కానీ అది చాలా హీన మైన స్వభావం. అలా ఎల్లప్పుడు బోర్లా పడునే వాళ్ళ జన్మ అంత శ్రేష్టమైనది కాదు.

* మగవాళ్ళు బోర్లా పడుకోవడం.. ఆడవాళ్ళూ వెల్ల కిల్లా పడుకోవడం మంచిది కాదు. ఈ విషయాని మన ఇంట్లో పెద్ద వాళ్ళు పదే పదే చెప్పుతుంటారు. కానీ మనం వినము.

* మనలో చాలా మందికి పడునేటప్పుడు రెండు మోకాళ్ళు రొమ్ము లోపలికి లాక్కుని ముడుచుకొని పడుకునే అలావాటు ఉంటుంది. అయితే అలాంటి వాళ్ళు పూర్వజన్మలో శునకమై ఉంటారు.