స్టార్ హీరోయిన్ విషయంలో కోర్టు సంచలన తీర్పు..నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ..!!

ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా.. పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన అందచందాలతో పాటు నటనలోను ఆరి తేరి పోయిన నటి. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు శ‌తృఘ్న సిన్హా త‌న‌య అయిన సోనాక్షి ద‌బాంగ్ సినిమాతో సినీ రంగ ప్ర‌వేశం చేసింది. ఆ సినిమా మంచి హిట్ కావ‌డంతో త‌న‌దైన గుర్తింపు ద‌క్కించుకుంది. బాలీవుడ్ లో అమ్మడుకి బాగా డిమాండ్ ఉంది. బడా బడా హీరోలు కూడా..వాళ్ల సినిమాల్లో ఆమెను హీరోయిన్ గా పెట్టుకోవడానికి ఆశక్తి చూపిస్తుంటారు. అంతేనా అమ్మడు ఎంత రెమ్యూనరేషన్ అడిగిన కాదనకుండా ఇస్తారు. నటనలో క్వీన్, డ్యాన్స్ బాగా చేస్తుంది.. ఎక్స్ పోజింగ్ అంటే నో చెప్పదు..మరి అడిగినంత డబ్బులు ఇచ్చి పెట్టుకోకుండా ఉంటారా..?

అయితే తాజా సమాచారం ప్రకారం..ఈ ముద్దుగుమ్మ పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. దీంతో బాలీవుడ్ లోకల్ మీడియాలోనే కాకుండా నేషనల్ మీడియాలోను అమ్మడు హాట్ టాపిక్ గా మారింది. ఓ ఈవెంట్ కి వెళ్లడానికి అన్నీ మాట్లాడుకుని డబ్బులు కూడా తీసుకుని లాస్ట్ మూమెంట్ లో హ్యాండ్ ఇచ్చింది. దీంతో సదరు మేనేజర్ కి కోపం వచ్చి కోర్టు లో కేసు వేయగా ..ఫైనల్ గా అమ్మడు తలపొగరుకి ..కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ ఇచ్చింది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ ప‌ట్టణంలో క‌ట్‌ఘ‌ర్ ప్రాంతానికి చెందిన ఈవెంట్ నిర్వాహ‌కుడు ప్ర‌మోద్ శ‌ర్మ సోనాక్షి సిన్హాకు తాను నిర్వహిస్తున్న ఓ ఈవెంట్ కి చీప్ గెస్ట్ వచ్చి అవార్డులు ఇవ్వాలని..దానికి అమౌంట్ కూడా మాట్లాడుకుని..ఫైనల్ గా డబ్బును కూడా ఇచ్చేశాడట(37 లక్షలు). కానీ చివరి క్షణంలో అమ్మడు ప్ర‌మోద్ శ‌ర్మ పద్ధతి నచ్చక ..ఆ ఈవెంట్ కి పోలేదట. సరే ఆయన డబ్బులు ఇచ్చేయమని అడగ్గా..అమ్మడు నో ఛాన్స్ అంటూ అతని పట్టించుకోలేదు. కోపం వచ్చిన ఆయన కోర్టు లో కేసు వేశాడు. అప్పటికి కనీసం విచారణకి కూడా అటెండ్ అవ్వకుండా..ఎటువంటి సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంది. దీంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే తేది ఏప్రిల్ 24న సోనాక్షిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాలని ఆదేశించింది. మ‌రిప్పుడు సోనాక్షి సిన్హా ఏం చేస్తుందో చూడాలి.

Share post:

Popular