విజయ్ దేవరకొండతో సమంత చేసేది అలాంటి సినిమానా?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ బాక్సర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ తన నెక్ట్స్ చిత్రాలను వరసగా ఓకే చేస్తూ దూసుకుపోతున్నాడు.

ఇప్పటికే ఈ క్రమంలో దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్‌లో ఓ సినిమాను కమిట్ అయ్యాడు ఈ హీరో. ఇక ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్‌గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ సినిమాకు సంబంధించి చిత్ర వర్గాల్లో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కథ 70 శాతం కశ్మీర్‌లో సాగుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఆర్మీ వ్యక్తిలా మనకు కనిపిస్తాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ సినిమా గతంలో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన రోజా చిత్రాన్ని ఈ సినిమా మనకు గుర్తుకు తెస్తుందని చిత్ర వర్గాల్లో టాక్ జోరుగా వినిపిస్తోంది. గతంలో విజయ్ దేవరకొండ, సమంత ‘మహానటి’చిత్రంలో కలిసి నటించారు. అప్పుడు వారి మధ్య కెమిస్ట్రీ బాగా కుదరడంతో, ఇప్పుడు మరోసారి వారిద్దరి కాంబినేషన్ సెట్ కావడంతో అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తు్న్నారు. అయితే ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్.

Share post:

Latest