ప్రామిస‌రీ నోట్ రాసేటప్పుడు ఈ 10 విషయాలు తప్పక గుర్తుపెట్టుకోవాలి… లేకపోతే ఒక్క రూపాయి కూడా రాదు..జాగ్రత్త..!!

ప్రామిసరీ నోటు అంతే కొంతమందికి మంది తెలిసి ఉండచ్చు..కానీ దానిని రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా మందికి తెలియదు. తెలిసినా కొన్ని సార్లు పొరపాట్లు చేసే ఛాన్స్ ఉంది. ఇక అలా ఏదైన పొరపాటను ఈ తప్పు చేసారో..అంతే మీకు ఒక్క రూపాయి కూడా చేతికి రాదు. మొత్తం డబ్బులు గొవిందా గోవిందా..అనాల్సిందే..!!మనం ఇతరుల నుండి డబ్బులు అప్పుగా తీసుకునేటప్పుడు తాను తిరిగి చెల్లించడానికి గాను రాసే వాగ్ధాన పత్రాన్నే ప్రామిసరీ నోటు అని అంటాము. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనిషిని నమ్మి డబ్బు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు జనాభ. అందుకని అందరు ఇలాంటి ప్రామిస‌రీ నోట్ నే నమ్ముకుంటున్నారు.

మనం ఎవరి దగ్గర నుంచి అయినా పెద్ద మొత్తంలో అప్పుగా డబ్బును తీసుకున్నప్పుడు.. అందుకు సాక్ష్యంగా ఈ ప్రామిసరీ నోటును రాయించుకుంటారు. అయితే ఈ ప్రామిసరీ నోటు, దాని పై వాళ్ళ సంతకం ఉంటే చాలు.. ఇంక మన డబ్బు ఎక్కదికి పోదు ఎలాగైన దక్కించుకోవచ్చున అనుకుంటారు కొందరు. అలా అనుకుంటే మీరు పప్పు కాళ్ళు వేసిన్నత్లే. ఆ ప్రామిసరీ నోట్ రాయడానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఒక్కవేళ రాసేటప్పుడు తెలిసీ తెలియక కొన్ని పొరపాట్లు జరిగితే ఆ ప్రామిసరీ నోటు చెల్లదు. మీకు ఒక్క రూపాయి కూడా రాదు.

ప్రామిస‌రీ నోట్ రాసేట్టప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

* ఫస్ట్ మెయిన్ పాయింట్ ప్రామిసరీ నోట్ రాయించుకోవాలంటే.. రాయించుకున్న వారికి రాయించి ఇచ్చిన వారికి ఇద్దరికి ఖచ్చితంగా ఇద్దరు 18 సంవత్సరాలు దాటి ఉండాలి. లెదంటే రాయడం రాయించుకోవడం వేస్ట్

* ప్రామిసరీ నోట్ తయారు చేసేటప్పుడు.. ఖచ్చితంగా అప్పు ఇచ్చిన వారు..వాళ్ళ దగ్గర నుండి తీసుకున్న వారు.. ఇద్దరు పక్కన ఉండి ప్రామిసరీ నోటు రాయించుకోవాలి. లేకపోతే అక్కడౌన్న వారు ఒప్పుకోరు.

* ఎంత పద్ద మొత్తంలో డబ్బుని తీసుకున్నా.. ఇచ్చినా..ప్రామిసరీ నోట్ చెల్లే కాలం మూడు సంవత్సరాలు మాత్రమే. ఆ తరువాత మల్ళీ కొత్త ప్రామిసరీ నోట్ రాయించుకోవాల్సిందే.

* నోట్ మీద రెవెన్యూ స్టాంప్ అంటించిన దానిపై అడ్డంగా సంతకం చేయాలి. ఆ రెవెన్యూ స్టాంప్ ధర మినిమం ఒక రూపాయి ఉండాలి. సంతకం తప్పుగా చేసినా..లేద సంతకం బాగా రాలేదని మల్ళీ రుద్దిన ..ఆ ప్రామిసరీ నోట్ పనికి రాదు.. మళ్లీ కొత్తదు చేయించుకోవాల్సిందే.

* ప్రామిసరీ నోటు పై సుమారు మనం కోటి రూపాయల వరకు అప్పుగా తీసుకోవచ్చు. కానీ ఇలా ఎక్కువ మొత్తంలో డబ్బును తీసుకుంటున్నాప్పుడు తప్పనిసరిగా లాయర్ ను సంప్రదించి వాటిని చూసుకోవాలి. అలా చేస్తే ఇచ్చే వారికి తీసుకునే వారికి ఇద్దరికి మంచిది.

* ప్రామిసరి నోట్ లో అప్పు ఇస్తున్న ఫ్యక్తి పేరు..తీసుకుంటున్న వ్యక్తి పేరు ఇద్దరివి ఉండాలి.

*ముఖ్యంగా ప్రామిసరీ నోట్ రాయించుకున్న వారు నేను ఫలానా వ్యక్తి దగ్గర ఇంత పెద్ద మొత్తంలో అప్పుగా తీసుకున్నాను దానిని నేను తిరిగి ఇస్తాను అనే పాయింట్ లేకపోతే ఆ ప్రామిసరీ నోట్ తయారు చేయించినా కూడా ఉపయోగం ఉండదు. కనక ప్రామిసరీ నోట్ రాయించుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించాలి.

Share post:

Latest