తెలుగు వాళ్ళే అయినా.. ఇతర భాషల్లో మాత్రం స్టార్ లు..?

సినిమా ఇండస్ట్రీకి ప్రాంతంతో భాషతో సంబంధం లేదు అని చెబుతూ ఉంటారు. టాలెంట్ ఉండాలి కానీ ఏ భాషలో అయినా ఏ ఇండస్ట్రీలో అయినా రాణించవచ్చు అని అంటూ ఉంటారు. ఇక ఇదే విషయాన్ని ఎంతోమంది నటీనటులు నిజం చేసి చూపించారు. ఎందుకంటే ఒక భాషలో హిట్ కాలేకపోయిన వారు మరో భాషలో ఎంట్రీ ఇచ్చి సూపర్హిట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా తెలుగు నటీనటులు ఎంతోమంది తమిళ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. పుట్టింది పెరిగింది తెలుగు రాష్ట్రాల్లో అయినా ఇప్పుడు మాత్రం ఇతర ఇండస్ట్రీలో స్టార్ లుగా కొనసాగుతు న్నారు.. ఆ లిస్టు ఏంటో చూద్దాం..

జయం రవి : తమిళ చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న జయం రవి మూలాలు మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి అని చెప్పాలి. తండ్రి మోహన్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎడిటర్ గా పని చేశాడు. ఆయన తెలుగువారే కావడం గమనార్హం.

జీవ : ప్రస్తుతం తమిళంలో మంచి గుర్తింపు ఉన్న యువ హీరోగా కొనసాగుతున్న జీవ టాలీవుడ్ నిర్మాత ఆర్.బి.చౌదరి కుమారుడు కావడం గమనార్హం.

విశాల్ : అచ్చ తెలుగు అబ్బాయి అయిన విశాల్ ఇక ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ మాత్రం తన స్టార్ డమ్ తో దున్నేస్తున్నారు. తమిళంలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.

బాబీ సింహ : తమిళంలో వరుస సినిమాలతో అదరగొడుతున్న బాబి సింహ పుట్టింది మాత్రం హైదరాబాద్లోనే. చదివింది కూడా తెలుగు మీడియంలోనే. ఆ తర్వాత తమిళనాడు వెళ్లిపోయారు ఈయన కుటుంబం.దీంతో అక్కడ సినిమాల్లో గుర్తింపు సంపాదించుకున్నాడు.

వైభవ్ : గొడవ సినిమాతో పరిచయమైన నటుడు వైభవ్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కోదండ రామిరెడ్డి కుటుంబానికి సన్నిహితుడు కావడం గమనార్హం. టాలీవుడ్ లో కలిసి రాకపోవడంతో తమిళంలో కి వెళ్లి అక్కడ రాణిస్తున్నాడు.

శ్రీరామ్ : ఇక తెలుగు నటుల లో ఒకరైన శ్రీ రామ్ ఇక్కడ ఎన్నో సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్నారూ. కానీ కలిసి రాకపోవడంతో తమిళంలో వెళ్ళిపోయారు.

జానీ లివర్ : బాలీవుడ్ లో ఒకప్పుడు చక్రం తిప్పిన కమెడియన్ జానీ లివర్ తెలుగువారే కావడం గమనార్హం. అయితే ఈయన కామెడీ టైమింగ్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు అందరూ బ్రహ్మరథం పట్టారు అని చెప్పాలి.

దియా మీర్జా : బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ వున్న హీరోయిన్గా కొనసాగుతున్న దియా మీర్జా అచ్చతెలుగు అమ్మాయి కావడం గమనార్హం.

అదితి రావు హైదరి : వనపర్తి మహా సంస్థానం వారసురాళ్లలో అతిథి రావు హైదరి ఒకరు ఇక పక్క తెలుగు అమ్మాయి అయినా అతిధి రావు హైదరి.. ఇక ఇప్పుడు తమిళ హిందీ సినిమాల్లో ఎక్కువగా రాణిస్తూ ఉంది.

ఆనంది : మారుతి దర్శకత్వంలో వచ్చిన బస్స్టాప్ సినిమా లో నటించిన ఆనంది ఇక్కడ అవకాశాలు లేకపోవడంతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అక్కడ మంచి గుర్తింపు సంపాదించుకుంది.

శ్రీదివ్య : ఈటీవీ లో ప్రసారమయ్యే సీరియల్ స్థాయినుంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది శ్రీదివ్య. తెలుగులో కొన్ని సినిమాలు చేసినా శ్రీదివ్య తమిళంలో మాత్రం మంచి గుర్తింపు సంపాదించుకుంది. వీరితో పాటు అంజలి, సమీరారెడ్డి, షెర్లిన్ చోప్రా, రాజ్ అండ్ డీకే దర్శకత్వం ద్వయం కూడా తెలుగువారే కావడం గమనార్హం.