విడాకుల తర్వాత ఫస్ట్ టైం.. ఐశ్వర్యపై ధనుష్ పోస్ట్..నెట్టింట వైరల్..!!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉండే చాలా మంది సెలబ్రిటీలు..స్టార్ డాటర్స్ ..బడా బడా హీరోలు..విడాకులు ప్రకటిస్తూ అభిమానులకు ఊహించని షాక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇండస్ట్రీ నుండి ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతున్నారు అభిమానులు. కాగా రీసెంట్ గా నే తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ఎండ్ కార్డ్ పెట్టేసిన స్టార్ డాటర్ ఐశ్వర్య..కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్..అభిమానులతో పాటు సినీ పెద్దలకు ఊహించని షాక్ ఇచ్చారు.

ఎవ్వరు ఊహించని విధంగా..ఈ మధ్యనే ..” మేము మా వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాం. విడి విడి గా బ్రతకాలని నిశ్చయించుకున్నాం. మేము భార్య భర్తలుగానే..విడిపోతున్నాం. కానీ మేము జీవితాంతం ఫ్రెండ్స్ గా ఉంటాం”..అంటూ ఓ పోస్ట్ పెట్టి..పవిత్ర బంధాని తెంపుకున్నారు.

విడాకుల తరువాత వీళ్ల గురించి ఎన్నో కామెంట్స్ వినిపించాయి..ఎందరో ట్రోల్స్ చేశారు..కానీ ఏ రోజు ఆ విషయాల గురించి పట్టించుకోకుండా ఇద్దరు తమ లైఫ్ లో బిజీ అయిపోయారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య..కెరీర్ పై ఫోక్స్ పెడుతూ..పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ పై సైన్ చేస్తుంది. కాగా, రీసెంట్‌గా ఐశ్వ‌ర్య .. ‘పయని’ అనే మ్యూజిక్ వీడియోను డైరెక్ట్ చేసింది.

అయితే ఆశ్చ‌ర్య‌క‌రంగా.. ఈ మ్యూజిక్ వీడియో గురించి ఆమె మాజీ భర్త స్టార్ హీరో ధ‌నుష్ పోస్ట్ చేయ‌డం నిజంగానే అందరిని షాక్ కు గురి చేసింది. ‘పయని’ మ్యూజిక్ వీడియోను డైరెక్ట్ చేసిన నా ఫ్రెండ్ ఐశ్వర్యకు అభినందనలు. గాడ్ బ్లెస్ యు’’ అంటూ ధనుష్ పోస్ట్ పెట్టాడు. దానికి ఆమె రిప్లై ఇస్తూ థాంక్స్ చెప్పారు. దీంతో ధనుష్ పై అభిమానులు మండిపడుతున్నారు. ఫ్రెండ్ భార్య అవచ్చు కానీ,భార్య అయ్యి తలైన ఆవిడ ను ఫ్రెండ్ గా మార్చడం కరెక్ట్ కాదు అంటూ తిట్టిపోస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Share post:

Popular