హీరోగా.. నిర్మాత‌గా.. రెమ్మున‌రేష‌న్ విష‌యంలో ఎన్టీఆర్‌ స్ట‌యిలే వేరు..!

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ఎన్టీఆర్ స్ట‌యిలే వేరు. హీరోగా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా ఆయ‌న అనేక భిన్న‌మైన పాత్ర‌లు పోషించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న రెమ్మూన‌రేష‌న్ విష‌యంలో చాలా ఖ‌చ్చితంగా వ్య‌వ‌హ‌రించే వార‌ట‌. ఒక్క రూపాయిని కూడా వ‌దుల‌కునేందుకు ఇష్ట‌ప‌డేవారు కాద‌ట‌. అయితే.. తీసుకున్న ప్ర‌తి రూపా యికీ.. న్యాయం చేసేవార‌ని.. నిర్మాత‌లు అనేవారు. ఇక‌, ప్ర‌తి సినిమా విష‌యంలో అన్న‌గారు చాలా క‌మిట్ మెంట్‌తో వ్య‌వ‌హ‌రించేవారు. ఒక సినిమాను ఒప్పుకుంటే.. ఆ సినిమా పూర్తయ్యే వ‌ర‌కుదాదాపు మ‌రో సినిమా జోలికి వెళ్లేవారు కార‌ట‌.

ఒక‌వేళ ఏదైనా ఒప్పుకోవాల్సి వ‌చ్చినా.. ఇప్ప‌టిలా.. ఒకేసారి నాలుగు సినిమాల‌కు సంత‌కాలు చేయ‌డం కా దు.. ఏదైనా ఒప్పుకొంటే.. దానికి పూర్తిగా న్యాయం చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చేవార‌ట‌. ఈ త‌ర‌హా ప‌రిస్థితి లో ఒక్కొక్క‌సారి.. సినిమాల‌ను కూడా వ‌దులుకున్న సంద‌ర్భాలు ఉన్నాయ‌ని అంటారు. అయిన‌ప్ప‌టికీ.. అన్న‌గారు ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గేవారు కార‌ట‌. ఆయ‌న అనుకున్న ట్టుగానే వ్య‌వ‌హ‌రించేవారు.

ఇక‌, రెమ్యున‌రేష‌న్ విష‌యంలో ఆయ‌న అడిగినంత కాదు.. నిర్మాత బ‌లాన్ని బ‌ట్టి.. సినిమాను బ‌ట్టి అంచ‌నా వేసుకుని తీసుకునేవారట‌. ఇక‌, ఈ విష‌యంలో పేచీలు ఉండేందుకు అన్న‌గారు అస‌లు ఇష్ట‌ప‌డేవారు కాద‌ట‌. ఇవ్వాల్సిన ప్ర‌తి రూపాయిని తీసుకునేవారు. సినిమా ఆడుతుందా.. లేదా.. అనే విష‌యాల‌ను ముందుగానే అంచ‌నా వేసుకుని తీసుకునేవార‌ట‌. ఇక‌, తాను నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించి కూడా అన్న‌గారు అనేక సినిమాలు తీసుకున్నారు.

ఈ క్ర‌మంలో తోటి క‌ళాకారులు కూడా అడిగినంత ఇచ్చేవారు కాదు. వారి పాత్ర‌, ష‌డ్యూల్‌, కాల్ షీట్లు ఇలా.. అన్ని విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని వారికి తానే రెమ్యూన‌రేష‌న్ నిర్ణ‌యించేవార‌ట‌. దీంతో అన్న‌గారి సినిమాలో చేసిన వారు.. ఇదీ.. మా రెమ్యూన‌రేష‌న్ అని అనుకునేవార‌ట‌. అంతేకాదు.. అన్న‌గారి సినిమాలో ఆఫ‌ర్ కోసం.. న‌టులు క్యూక‌ట్టే వారంటే ఆశ్చ‌ర్యం అనిపించ‌క‌పోదు