ఔను! సుదీర్ఘకాలం పాటు.. సినీ రంగాన్ని ఏలిన అన్నగారు ఎన్టీఆర్. వందలకొద్దీ సినిమాల్లో నటించారు. కృష్నాజిల్లా నుంచి మద్రాస్ వెళ్లి.. అక్కడే స్థిరపడిన (మొదట్లో) ఎన్టీఆర్ ఎన్నో ఏళ్లపాటు.. అక్కడే ఉన్నా రు. ఈయనొక్కరే కాదు.. అనేక మంది హీరోయిన్లు కూడా మద్రాస్‌లోనే స్థిరపడ్డారు. పైగా.. ఇప్పట్లా రెండు నెలలకోసారి.. హీరోయిన్లు మారిపోయే సినిమాలు అప్పట్లో ఉండేవి కాదు. ఏళ్ల తరబడి హీరో హీరోయిన్లు.. ఒకే సినిమాలో నటించిన సందర్భాలు కోకొల్లలు. పైగా.. అందరూ ఒకే కుటుంబం మాదిరిగా ఉండేవారు. ఒకే కారులో (నిర్మాత సమకూర్చిన)నే అందరూ షూటింగ్ స్పాట్‌కు వచ్చేవారు.
ఈ నేపథ్యంలో హీరోలకు, హీరోయిన్లకు మధ్య అనేక తమాషా మాటలు, వ్యాఖ్యలు కూడా చోటు చేసుకునే వి. అంతేకాదు.. అనుబంధాలు కూడా ఉండేవి. పుట్టినరోజుల నాడు విష్ చేసుకోవడమే కాదు.. షూటింగ్ అయ్యాక.. అక్కడే పండగలు చేసుకునేవారు. ఒకరింటికి ఒకరు వెళ్లేవారు. ఈ నేపథ్యంలో తెలుగు చలన చిత్ర రంగానికి సంబంధించి.. పలువురు హీరోలు, హీరోయిన్లు.. ప్రేమలో పడిన సంఘటనలు చాలానే ఉన్నాయి.
మరి అన్నగారి పరిస్థితి ఏంటి? ఎవరితోనైనా ఎఫైర్లో పడ్డారా? అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. కానీ, అప్పట్లో మాత్రం పెద్ద ఎత్తున గుసగుస ఒకటి వినిపించేది. వైజయంతిమాలతో అన్నగారు ఎఫైర్ నడిపారని.. ఇండస్ట్రీలో పెద్ద టాక్ నడిచింది. అయితే.. దీనిని అటు ఆమె కానీ.. ఇటు అన్నగారు కానీ ఖండించలేదు. అలాగని..వారు ఎక్కడా బహిరంగ ప్రాంతాల్లో కలుసుకు న్నది కూడా లేదు. తొలి అవకాశం వైజయంతి మాలకు అన్నగారే ఇప్పించారనేది వాస్తవం.
కానీ, ఎఫైర్ ఉందాలేదా? అనేది మాత్రం ఇప్పటికీ నిరూపణ కాలేదు. కానీ, టాక్ మాత్రం చాలా సంవత్సరాలు నడిచిం ది. అయితే.. అప్పటికే అన్నగారికి వివాహం అయి.. నలుగురు పిల్లలు కూడా ఉండడంతో ఇది పెద్ద గ్యాసిప్ అని అన్నగారి అభిమానులు చెప్పుకొనేవారు. కానీ, దీనిపై ఇతమిత్థంగా ఎవరూపెదవి విప్పేవారు కాదు. ఏదేమైనా.. ఎఫైర్లు సాధారణమైన సినీ రంగంలో వీటిని తప్పుబట్టే వారు కూడా లేకపోవడం గమనార్హం.