RRR ఫ‌స్ట్ షో టాక్‌… ఫ‌స్టాఫ్ అరాచ‌కం… సెకండాఫ్ కాస్త స్లో..!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి విజువ‌ల్ వండ‌ర్ త్రిబుల్ ఆర్‌. మూడేళ్ల నుంచి ఊరిస్తూ ఊరిస్తూ వ‌చ్చిన ఈ సినిమా ఎట్ట‌కేల‌కు ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. సినిమా ఫ‌స్టాఫ్‌లో ఇద్ద‌రు హీరోల ఎంట్రీలు అదిరిపోయాయి. ముందుగా రామ్‌చ‌ర‌ణ్ ఎంట్రీ ఉంటుంది. ఆ త‌ర్వాత అదిరిపోయే విజువ‌ల్స్‌తో తార‌క్ ఎంట్రీ ఉంటుంది. సినిమా గోండు జాతికి సంబంధించిన క‌థాంశంతో స్టార్ట్ అవుతుంది. త‌ర్వాత ఓవీలియా మోరిస్ ఎంట్రీ, అలియాభ‌ట్ ఎంట్రీ ఉంటాయి. అలియా ఎంట్రీ సింపుల్‌గా ఉంటుంది.

ఎన్టీఆర్ – అలియా మ‌ధ్య వ‌చ్చే సీన్లు భావోద్వేగంతో ఉంటాయి. ఫ‌స్టాఫ్‌లో ప్రీ ఇంట‌ర్వెల్ నుంచి క‌థ స్పీడ‌ప్ అయ్యి క‌ళ్లు చెదిరే ఫైట్‌తో ఇంటర్వెల్ ముగుస్తుంది. ఫ‌స్టాఫ్‌లో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఎన‌ర్జిటిక్ పెర్పామెన్స్‌కు తోడు దోస్తీ, నాటు పాట‌లు బాగున్నాయి. ఇద్ద‌రికి కూడా ఈక్వ‌ల్ స్క్రీన్ స్పేస్ ఉంటుంది.

ఇక సెకండాఫ్‌లో సినిమా ఫ‌స్టాఫ్‌తో పోలిస్తే కాస్త స్లో అయిన‌ట్టే ఉంటుంది. సెకండాఫ్‌లో అజ‌య్ దేవ‌గ‌న్ ఎంట్రీ.. రామ్‌చ‌ర‌ణ్ ప్లాష్ బ్యాక్ ఇవ‌న్నీ ఎమోష‌న‌ల్‌గా క‌థ‌ను న‌డిపిస్తాయి. కీర‌వాణి మ్యూజిక్ బాగుంది. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ ఎన‌ర్జిటిక్ పెర్పామెన్స్‌, క‌ళ్లు చెదిరే విజువ‌ల్స్ అన్ని అదిరిపోయాయి. అయితే ఫ‌స్టాఫ్ మాత్రం అదిరిపోయేలా ఉంటే.. సెకండాఫ్ కొన్ని చోట్ల రొటీన్‌గా ఉన్న‌ట్టు అనిపిస్తుంది.

ఇద్ద‌రు హీరోల‌కు ఈక్వ‌ల్ స్క్రీన్ స్పేస్ ఇవ్వ‌డంలో రాజ‌మౌళిని మెచ్చుకోవాలి. ఓవ‌రాల్‌గా సినిమా అదిరిపోయింది. బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌రే.. రికార్డులు ఏ రేంజ్లో ఉంటాయో చూడాల్సి ఉంది.