అదే కనుక జరిగితే..రాజమౌళి పతనం మొదలైన్నట్లే..?

రాజమౌళి..సినీ ఇండస్ట్రీలో ఆయన కంటూ ఓ ప్రత్యేకమైన పేరుంది. ఆ పేరుకి ఓ చరిత్ర ఉంది. అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు సంపాదించుకున్న ఈయన సినిమాలంటే జనాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిమానుల నాడి పట్టి ఆయన సినిమాలు తీస్తారు అనే ఓ నమ్మకం. ఇంకా చెప్పాలంటే రాజమౌళి ట్రెండ్ ఫాలో అవ్వడు..సెట్ చేస్తాడు. ఇప్పటి వరకు మనం ఆయన తెరకెక్కించిన సినిమాలు చూస్తే ఆ విషయం క్లారిటీ గా అర్ధమైపోతుంది. బాహుబలి లాంటి ఓ బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించి మన తెలుగు సినిమా అంటే ఏంటో ప్రపంచ దేశాలకు చూపించిన ఏకైక డైరెక్టర్ జక్కన్న.

కాగా, ప్రజెంట్ ఆయన నాలుగేళ్ళు ఎంతో కష్టపడి తెరకెక్కించిన సినిమా “రణం రౌద్రం రుధిరం”. పవర్ ఫుల్ హీరోస్..చరణ్-తారక్ లను పెట్టి భారీ మల్టీ స్టారర్ గా ఈ మూవీని తెరకెక్కించాడు. ఇప్పటివరకు ఉన్న టాక్ ప్రకారం సినిమా మరో బాహుబలి అవుతుందని ఫిక్స్ అయిపోయారు అంతా. కానీ, సినీ విశ్లేషకుల అంచానాలు నిజమైతే రాజమౌళ్లి కి భారీ బొక్క తప్పదు అంటున్నారు. సినిమా పూర్తిగా దేశ భక్తిని చాటి చెప్పే సినిమా అయినా కానీ. ధియేటర్స్ కు వచ్చే ప్రజలు అంతో ఇంతో కామెడీ ని కోరుకుంటారు..యువత రొమాన్స్ ను ఎక్స్ పెక్ట్ చేస్తారు.

కానీ ఈ సినిమాలో ఆ రెండు లేవు. టోటల్ సినిమా అంతా కూడా ఓ ధీమ్ మీదనే సాగిపోతుంది. ఖచ్చితంగా ఇలాంటి సినిమా తారక్-చరణ్ ఇప్పటి వరకు చేయలేదు. మరీ ఫస్ట్ టైం ఇలా తమ అభిమానుల హీరో సినిమాలో కామెడీ లేకుండా జనాలు చూడగలరా అంటే లేదనే అంటున్నారు విశ్లేషకులు. ఫ్యాన్స్ అయితే సినిమా ఎలా ఉన్నా చూస్తారు. కానీ మిగత జనాలు అలా కాదు నచ్చితేనే చూస్తారు. దానికి బెస్ట్ ఉదాహరణ “రాధేశ్యామ్” భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా..బాక్స్ ఆఫిస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఈ సినిమా ని కూడా మొదట్లో ఓ రేంజ్ లో పొగిడేశారు..కానీ తీరా సినిమా రిలీజ్ అయ్యాక మ్యాటర్ నిల్. ఒక్కవేళ్ల RRR కూడా అభిమానులను ఆకట్టుకోలేకపోతే రాజమౌళి కెరీర్ లో ఇదే ఫస్ట్ ఫ్లాప్ సినిమా అవుతుంది. ఇక అక్కడి నుండి ఆయన పతనం స్టార్ట్ అయ్యిన్నట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు..? మరి చూడాలి ఏం జరగబోతుందో..??

Share post:

Popular