RRR@3Days: కలెక్షన్ల ఊచకోత..బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్ధలు..!!

ఎవ్వరు ఊహించని విధంగా..ఊహకందని రీతిలో ఇద్దరు టాప్ హీరోలతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం RR. దాదాపు నాలుగేళ్ళు ఎన్నో నిద్రలేని రాత్రులు గదిపి..ఎంతో మది కష్టపడి..ఫైనల్ గా ఈ నెల 25 న ప్రపంచవ్యాప్తంగా ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజైంది ఈ చిత్రం. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా.. వాళ్ల ఊహలను డబుల్ చేస్తూ..ప్రతి సీన్..ప్రతి షాట్ ఓ ఆణిముత్యం ల తెరకెక్కించాడు జక్కన్న.

ఈ సినిమాలో తారక్-చరణ్ పర్ఫామెన్స్ అందరిని ఆకట్టుకున్నాయి. గోండు వీరుడు కొమురం భీమ్‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ పర్ ఫెక్ట్ గా సెట్ అయ్యారు. తెలుగు సినిమా రేంజ్‌ను ప్ర‌పంచానికి చాటిన డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ఈ సినిమాలో తారక్ ను తక్కువ గా చేసి చూపించారు అని టాక్ వినిపిస్తున్నా…ముందే రాజమౌళి ఈ సినిమాలో మీరు పాత్రలు చూడాలి హీరో వ్యక్తిగత స్టేటస్ కాదంటూ ఇదివరకే క్లారిటీ ఇచ్చాడు. టాక్ ఎలా ఉన్నప్పటికి..ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద కాసుల సునామీ సృష్టిస్తుంది.

ఫస్ట్ డే ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో కలిపి రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి ‘ఆర్​ఆర్ఆర్’​ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.223 కోట్లు గ్రాస్ కలెక్షన్స్‌ను RRR సాధించి బాహుబలి 2 రికార్డులను చెరిపేసి నయా రికార్డులను క్రియేట్ చేసింది. కాగా, ఉత్తర అమెరికాలో ఈ మూవీ మార్చి 23 నుంచి 27 మధ్య 11 మిలియన్ డాలర్లు (రూ.83 కోట్లు) వసులు చేసింది. ఇక ‘ఆర్​ఆర్​ఆర్​’ మూవీ థియేటర్లలో మూడో రోజూ రికార్డులు సృష్టించింది. మూడో రోజు ఆదివారం కావడంతో సినిమా చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ధియేటర్స్ కి రావడంతో ఈ సినిమా మూడో రోజు భారీ కలెక్షన్స్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ సెంటర్లలో ‘ఆర్​ఆర్​ఆర్​’ మూవీ మొదటి రోజు కంటే ఆదివారమే ఎక్కువ వసూళ్లు నమోదైనట్లు ట్రేడ్ వర్గాలు చెప్పుతున్నాయి. ఇక మొత్తంగా RRR మూడో రోజు తెలుగు రాష్ట్రాలల్లో ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే.. 33.53 కోట్లు. మొత్తంగా చూస్తే ఈ మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 139.27 కోట్ల నెట్, 203.10 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి.కాగా ఇప్పటి వరకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు అత్యధిక షేర్ రాబట్టిన జాబితాలో 33.53 కోట్ల రూపాయలతో మొదటి స్థానంలో నిలిచింది RRR. దీంతో మెగా నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.