R R R లో ఆ హీరో చ‌నిపోతాడంటూ ఈ కొత్త రూమ‌ర్ ఏంటి..?

ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొట్లాది భారతీయులు ఎప్పటినుంచో ఎంతగానో ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మ‌రో 17 రోజుల్లో ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ సినిమా రిలీజ్ బిఫోర్ హంగామా 18 రోజుల ముందే ఎలా ఉందంటే ఓవ‌ర్సీస్లో ఓన్టీఆర్ అభిమాని ఒక‌రు ఏకంగా 75 టిక్కెట్లు బుక్ చేశారు. మ‌రో ఎన్టీఆర్ అభిమాని ఏకంగా ఓ థియేట‌ర్ షో టిక్కెట్లు అంతా బుక్ చేశారు. ఫ్లోరిడాలో ఈ బుకింగ్ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఒక్క ఓవ‌ర్సీస్‌లోనే ఏకంగా 1000 థియేట‌ర్ల‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దీనిని బ‌ట్టే ఈ సినిమా హంగామా ఏ రేంజ్‌లో ఉందో అర్థ‌మ‌వుతోంది. ఇక అటు రామ్‌చ‌ర‌ణ్ అభిమానుల ర‌చ్చ కూడా మామూలుగా ఉండేలా లేదు. ఓవ‌రాల్‌గా రు. 500 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ ఈ సినిమాకు జ‌రిగింది. నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ ద్వారానే రు. 225 కోట్లు నిర్మాత దాన‌య్య ఖాతాలో చేరాయి.

ఈ సినిమా రిలీజ్ హంగామా ఇంత‌లా న‌డుస్తోన్న వేళ సోష‌ల్ మీడియాలో ఓ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాలో ఓ హీరో క్యారెక్ట‌ర్ చ‌నిపోతుంద‌ట‌. ఒక వేళ అదే జ‌రిగితే ఆ హీరో ఫ్యాన్స్ ఖ‌చ్చితంగా డిజ‌ప్పాయింట్ అవుతారు. అది సినిమా రిజ‌ల్ట్ పై ప్ర‌భావం చూపుతుంది. కానీ రాజ‌మౌళి అలాంటి ప‌ని చేయ‌డ‌ని ఖ‌చ్చితంగా హ్యాపీ ఎండింగ్ ఉంటుంద‌ని అంటున్నారు.

ఇక ఆర్ఆర్ఆర్ మూవీ తొలిరోజు కలెక్షన్లు 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమాకు టికెట్లు దొరికే ప‌రిస్థితులు లేవు. మ‌రి త్రిబుల్ ఆర్ ఏం చేస్తుందో ? చూడాలి.