పెన్ని సాంగ్ లో మహేష్ బాబు సర్ప్రైజ్ అదుర్స్..సర్కారు వారి పాట లో సితార..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు..ఎప్పటికప్పుడు అభిమానులకు సర్ప్రైజ్ ఒస్తూ ఖుషీ చేస్తుంటారు. తాజాగా అలాంటి ఓ షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చి అభిమానులను ఉత్సాహ పరిచారు. మహేష్ బాబు డైనమిక్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ” సర్కారు వారి పాట” అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకుని ఉన్నారు.

మహేష్ అభిమానులకు నచ్చేలా ఈ సినిమా ను తెరకెక్కిస్తున్న పరశురామ్..ప్రతి విషయంలోను ఎంతో జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మహానటి కీర్తి సురేష్ తొలిసారిగా మహేష్ బాబు పక్కన జోడీగా నటిస్తుంది. ఈ మూవీ మైత్రి మూవీ మేకర్, 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు భారీ బద్జెట్ తీ నిర్మిస్తున్నాయి. కాగా ఈ మధ్యనే ఈ సినిమా నుండి కళావతి అనే పాటను రిలీజ్ చేసిన చిత్ర బృందం..ఇప్పుడు సినిమానుండి సెకండ్ సింగిల్ ని విడుదల చేసింది.

‘ఎవ్రీ ఎవ్రీ పెన్ని..’ అంటూ సాగే ఈ పాటలో మహేశ్‌ లుక్స్ చాలా స్టైలీష్ గా ఉన్నాయి. పాట ప్రోమో చూస్తుంటేనే హిట్ అన్ని పక్కాగా చెప్పెస్తున్నారు అభిమానులు, అయితే ఇక్కడే చిత్ర బృందం ఫ్యాన్స్ కి మరో సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ పాటలో మహేష్ స్వీట్ డాటర్ సితార ఘట్టమేనిన కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. గతంలో ఒక హాలీవుడ్ సినిమాకి వాయిస్ ఓవర్ అందించిన సితార, ఫస్ట్ టైం ఈ విధంగా స్క్రీన్ పై కనిపిస్తుండడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ పాటలో మహేష్ ఓ ఫారిన్‌ లేడి గ్రూప్‌తో డ్యాన్స్‌ చేస్తూ మనల్ని మెప్పిస్తే.. సితార మరో గ్రూప్‌తో లీడ్‌ డ్యాన్స్‌ర్‌గా చేసి అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇవన్నీ చూస్తుంటే తండ్రి మూవీతోనే సితార సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తుందేమో అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇలా తండ్రి కూతుళ్లను ఒకే పాటలో చూసి సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఫుల్‌ సాంగ్‌ రిలీజ్ అయితే యూట్యూబ్ షేక్ అవ్వాల్సిందే..రికార్డులు తిరగ రాయాల్సిందే..!!

Share post:

Popular