అద్గధి..ఎన్టీఆర్‌ అభిమానా మజాకా..RRR కోసం ఏం చేశాడో తెలుసా..!!

ఎన్టీఆర్‌..సినీ ఇండస్ట్రీలోకి నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి..తాతకు తగ్గ మనవడిగా పేరు సంపాదించుకున్నారు. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ.. సినిమా సినిమాకి వేరియేషన్స్ చూయిస్తూ..తప్పులు చేసినా వాటిని సరిదిద్దుకుంటూ..అభిమానులను ఎంటర్ టైన్ చేయడానికి నిరంతరం శ్రమిస్తుంటారు. సినిమా కోసం బరువు పెరగమన్నా పెరుగుతారు..తగ్గమన్నా తగ్గుతాడు..కష్టమైన స్టెప్స్ ని ఇస్తే..” నో, చేయలేను,లేదు, నా వాల్ల కాదు”అనకుండా ..ట్రై చేసి ఫైనల్ గా సాధిస్తాడు . అది ఎన్టీఆర్‌ అంటే..

ప్రజెంట్ ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి భారీ మల్టీ స్టారర్ మూవీగా “రణం రౌద్రం రుధిరం” అనే సినిమా లో నటించాడు. మరి కొద్ది రోజులో ఈ సినిమాతో మనముందుకు రాబోతున్నాడు ఎన్టీఆర్‌. దర్శక ధీరుడు తెరకెక్కించిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో చిత్రీకరించారు. దీంతో అభిమానులు ఈ సినిమా పై భారీ అంచనాలను పెట్టుకుని ఉన్నారు. అటు మెగా ఫ్యాన్స్..ఇటు నందమూరి ఫ్యాన్స్ ఇద్దరు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

కాగా, మార్చి 25న రిలీజ్ అవుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్‌ అమెరికాలో ఇప్పటికే ప్రారంభమైంది. బుకింగ్స్ సేల్స్ ఓ రేంజ్‌లో జ‌రుగుతున్నాయి. ఊహించినట్లుగానే గంటల వ్యవధిలోనే టికెట్లు అన్నీ అమ్ముడయ్యాయి. అయితే తాజాగా అమెకారిలో ఎన్టీఆర్‌ వీరాభిమాని చేసిన పని ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అమెరికాలోని డ‌ల్లాస్ న‌గ‌రంలోని గెలాక్సీ థియేట‌ర్లో ఎన్టీఆర్ వీరాభిమాని..ఒక్కడే ఏకంగా 75 టికేట్ల‌ను కొనుగోలు చేసేసి ఆశ్చర్యానికి గురి చేశాడు. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా..ఇది తారక్ పై వాళ్ళకు ఉన్న ప్రేమకు నిదర్శనం. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. దీన్ని బ‌ట్టి చూస్తే తార‌క్ అభిమానులు ఈ సినిమా గురించి ఎంత‌గా ఎదురుచూస్తున్నారో అర్థ‌మ‌వుతుంది. మరి చూడాలి రిలీజ్ అయ్యాక ఎన్ని సరికొత్త రికార్డులు నెలకొల్పబోతున్నారో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ..?

Share post:

Popular