RRR పై అలిగిన ఆలియా.. వాళ్లను అన్ ఫాలో..ఫొటోలు డిలీట్‌..?

RRR..గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ పేరు మారు మ్రోగిపోతున్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ఈ నెల 25 న విడుదలై..బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బడా బడా స్టార్స్ కూడా ఈ సినిమా పై పోగడ్తల వర్షం కురిపించారు. ఇప్ప‌టికే సినిమా విడుద‌లైన మూడు రోజుల‌కు ఐదు వంద‌ల కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను దాటేసిన ఈ చిత్రం ఇప్పుడు బ్రేక్ ఈవెన్ దిశ‌గా ఊర‌క‌లు వేస్తుంది.

అయితే సినిమా కలెక్షన్స్ పరంగా రికార్డ్ లు సృష్టిస్తున్నప్పటికి..టాక్ ప్రకారం పెద్ద గా ఆకట్టుకోలేకపోతుంది. ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమా పై గుర్రుగా ఉన్నారు. సినిమాలో తారక్ ని తక్కువుగా చేసి చూపించడం..పక్క హీరో చరణ్ ని హైలెట్ చేయడం..స్క్రీన్ స్పేస్ కూడా చరణ్ కే ఎక్కువ ఉండటంతో తారక్ అభిమానులు రాజమౌళి పై మండిపడుతున్నారు. కాగా, ఈ క్రమంలో నే మరో షాకింగ్ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన ఆలియా..చిత్ర దర్శకుడు రాజమౌలి పై కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది. సినిమాలో తన స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ చేశారని.. ముందు చెప్పిన దానికంటే మరి దారుణంగా తన సీన్స్ ఎడిట్ చేశారని..టోటల్ సినిమా మీద తన క్యారెక్టర్ పది నిమిషాలు కూడా లేదని చాలా బాధపడిందట. బాలీవుడ్ లో అలియా ఓ స్టార్ హీరోయిన్. ఆమె క్రేజ్ ఏంటో మనకు తెలిసిందే. అలాంటి అలియాను రాజమౌళి మరీ ఇంత తక్కువ టైం చూయించడం తో బాలీవుడ్ లో ఆమె ఫ్యాన్స్ హర్ట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు అలియా కూడా జక్కన్న మీద ఉండే కోపంతో..సోషల్‌మీడియా ఫీడ్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు సంబంధించిన ఫొటోలన్నింటినీ తొలగించింది. అంతేకాదు రాజమౌళిని కూడా అన్‌ఫాలో చేసిందని తెలుస్తోంది. దీంతో ఈ మ్యాటర్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.