జక్కన్న సినిమాల్లో ఒక కామన్ పాయింట్.. ఇప్పుడు త్రిబుల్ ఆర్ లో కూడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ ఎల్లలు దాటించిన దర్శకుడు ఎవరు అంటే అందరూ టక్కున చెప్పే పేరు దర్శకధీరుడు రాజమౌళి. రికార్డులు క్రియేట్ చేసే సినిమాలు చేయాలన్న.. తన పేరుతోనే రికార్డులు క్రియేట్ చేయాలన్న అది కేవలం రాజమౌళి కి మాత్రమే సాధ్యం. ఏకంగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయి బాహుబలి కి ముందు బాహుబలి తర్వాత అనేంతలా మారిపోయింది. అంతకుముందు వరకు వేరే దేశం వాళ్ళకి ఇండియన్ సినిమా అంటే పట్టింపు ఉండేది కాదు. కానీ బాహుబలి తర్వాత మాత్రం అందరిచూపు ఇండియన్ సినిమా వైపు మరలింది.

అంతలా తెలుగు సినిమా స్థాయిని పెంచింది బాహుబలి సినిమా. ఇక బాహుబలి సినిమా తర్వాత అన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమాలు వస్తూ ఉండడం గమనార్హం. అయితే మిగతా దర్శకులతో పోల్చి చూస్తే అటు రాజమౌళికి ప్రత్యేకమైన టేకింగ్ ఉంటుంది. అయితే రాజమౌళి తెరకెక్కించిన ఎన్నో సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఉంటుంది అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏంటి రాజమౌళి సినిమాలో కామన్ పాయింట్.. అది ఏంటబ్బా అని ఆలోచనలో పడిపోయాడు కదా.

ఇంతకీ రాజమౌళి సినిమాలో కామన్ పాయింట్ ఏంటి అంటే హీరోని లేదా ప్రముఖ పాత్ర పోషించేవారిని వెన్నుపోటు పొడుస్తు న్నట్లు చూపిస్తారు. చత్రపతి సినిమాలో యమదొంగ సినిమాలో కూడా ఇలానే వెనుకనుంచి విలన్ పొడుస్తాడు. ఇక విక్రమార్కుడు సినిమా లో కూడా ఇలాంటి సన్నివేశం ఉంటుంది. బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న విషయం పెద్ద సెన్సేషనల్ మారిపోయింది. దీంతో ఇక ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా లో కూడా ఇలాంటి సన్నివేశం ఉండబోతుందా అన్నది ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఒకవేళ ఇలాంటి సన్నివేశం ఉంటే ఏ హీరో మీద ఉంటుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది..