న‌టి ప్ర‌గ‌తి హీరోయిన్‌గా చేసిన తొలి సినిమా వెన‌క ఇంత క‌థ ఉందా…!

ప్రగతి.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగుతోపాటు సౌత్ భాషలన్నింటిలోనూ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా స‌త్తా చాటుతున్న వారిలో ప్ర‌గ‌తి పేరు ముందు వ‌ర‌స‌లో ఉంటుంది. సినిమాల్లో తల్లి, అత్త, వదిన, పిన్ని వంటి పాత్రలు చేసే ప్రగతి.. బుల్లితెర పై కూడా పలు సీరియల్స్ లో నటించి ప్రేక్ష‌కుల‌కు బాగా చేర‌వైంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలు, వ‌ర్కౌట్ వీడియోలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

అయితే ప్ర‌స్తుతం స‌హాక పాత్ర‌ల‌ను పోషిస్తున్న ప్ర‌గ‌తి.. ఒక‌ప్పుడు హీరోయిన్‌గా న‌టించంద‌ని మీకు తెలుసా..? అవును, ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు జిల్లాలో జన్మించిన ప్ర‌గ‌తి.. చిన్న త‌నంలో తండ్రిని కోల్పోయింది. తల్లికి సాయంగా ఉండటం కోసం కాలేజీలో ఇంట‌ర్ చ‌దువుతున్న రోజుల్లోనే చెన్నైలోని మైసూర్ సిల్క్ ప్యాలెస్ వారి ప్రకటనల్లో న‌టించింది. అలాగే కార్టూన్ పాత్రలకు గాత్రదానం కూడా చేసేది.

అయితే ప్ర‌గ‌తి ప్ర‌క‌ట‌న‌ల‌ను చూసిన తమిళ దర్శకుడు భాగ్యరాజ్ త‌న సినిమాలో హీరోయిన్‌గా ఆమెను ఎంపిక చేశారు. అలా ప్ర‌గ‌తి హీరోయిన్‌గా చేసిన తొలి సినిమా `వీట్ల విశేశాంగ`. ఇందులో భాగ్య‌రాజ్ హీరోగా న‌టించాడు. 1994లో విడుద‌లైన ఈ త‌మిళ్ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో.. ప్ర‌గ‌తికి మ‌రిన్ని ఆఫ‌ర్లు వెల్లువెత్తాయి.

దాంతో ఆమె వ‌ర‌స‌గా ఏడు తమిళ సినిమాలతో పాటు ఒక మలయాళ మూవీలో న‌టించింది. ఇక కెరీర్ ఊపందుకుంటున్న‌ త‌రుణంలో ప్ర‌గ‌తి అనూహ్యంగా పెళ్లి చేసేసుకుంది. ఆ టైమ్‌కు ఆమె వ‌య‌సు ఇర‌వై ఏళ్లే కావ‌డం గ‌మ‌నార్హం. వివాహం అనంత‌రం కొన్నాళ్లు న‌ట‌న‌కు దూరంగా ఉన్న ప్ర‌గ‌తి.. మ‌ళ్లీ `బాబీ`తో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా సెటిల్ అయింది.