`బ్ర‌ద‌ర్‌`కు బాగోలేదు.. మానుకోవ‌డ‌మే మంచిది..?

అంద‌రికీ రాజ‌కీయాలు ప‌నికిరావు. కొంద‌రికి మాత్ర‌మే ఇవి సూట‌వుతాయి. రాజ‌కీయాలు చేయాల‌ని మా త్రం అంద‌రికీ ఉండొచ్చు. కానీ, కాలం క‌లిసి రావాలి క‌దా! ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది.. బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ గురించి. ఏపీ సీఎం జ‌గ‌న్ కు సొంత బావ‌మ‌రిది… ప్ర‌ముఖ మ‌త ప్ర‌బోధ‌కుడు.. అనిల్ కుమార్ ఇటీవ‌ల కాలంలో పెద్ద ఎత్తున ఏపీలో తిరుగుతున్నారు. బీసీ సంఘాల‌ను.. క్రైస్త‌వ సంఘాల‌ను కూడా ఆ యన క‌లుస్తున్నారు. నిజానికి వారు ఈయ‌న‌ను క‌లుస్తున్నారో..లేక ఈయ‌నే వారిని క‌లుస్తున్నారో.. తెలియ దు కానీ.. మొత్తానికి ఏపీలో అయితే.. అనిల్ ప‌ర్య‌టిస్తున్నారు.

ఈ ప‌రిణామాల క్ర‌మంలో తాను ఏదైనా చేయాల‌ని అనుకుంటున్నాన‌ని.. అనిల్ చెబుతున్నారు. అంతేకా దు..గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో బీసీల‌కు, క్రైస్త‌వుల‌కు తాము కొన్ని హామీల‌ను ఇచ్చాన‌ని.. వారంతా.. వైసీ పీకి ఓట్లు వేశార‌ని.. సో.. వారి ప‌క్షాన నిల‌బ‌డ‌తతాన‌నిచెప్పారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న క్రైస్త‌వ పార్టీ స్తాపించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో.. రాష్ట్రంలో ఇదో పెద్ద చ‌ర్చ‌గా మారింది. నిజానికి ఆయ‌న పార్టీ పెడ‌తారో లేదో తెలియ‌దు కానీ.. దీనిపై మాత్రం రాష్ట్రంలో చ‌ర్చ ఆగ‌డం లేదు.

తాజాగా క్రైస్త‌వ సంఘాలు.. విజ‌య‌వాడ‌లో భేటీ అయ్యాయి. బ్ర‌ద‌ర్ అనిల్‌కు సూటిగానే ఒక విష‌యాన్ని స్ప‌ష్టం చేశాయి. అదేంటంటే.. ఆయ‌న‌కు రాజకీయాల‌కు ప‌డ‌బోవ‌ని! రాజ‌కీయాల్లోకి వ‌స్తే.. ఆయ‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఇమేజ్ పూర్తిగా పోతుంద‌ని.. క్రైస్త‌వ సంఘాల నాయ‌కులు తెగేసి చెబుతున్నారు. రాజ‌కీయాల్లోకి వ‌స్తే.. అన‌వ‌స‌రంగా..మాట‌లు ప‌డాల్సి ఉంటుందని.. క‌నీసం.. ఇప్ప‌టి వ‌ర‌కు న‌డిచే దేవుడిగా భావిస్తున్న‌ అనేక అనిల్‌.. ఇక‌పై ఇలాంటి మాట‌లు ప‌డాలా? అనేది వారి ప్ర‌శ్న‌.

త‌మ‌కు అనిల్ అంటే.. ఎంతో భ‌క్తి, గౌర‌వం ఉన్నాయ‌ని.. ఆయ‌న చేస్తున్న చారిటీతో అంద‌రినీ ఆదుకోవ‌చ్చ‌ని.. లేదా ఎన్నారైలను క‌లిపి ఆయ‌న సేవ చేయొచ్చ‌ని, రాజ‌కీయాల్లోకి మాత్రం వ‌ద్ద‌ని వారు ముక్త‌కంఠంతో చెబుతున్నారు. ఎవ‌రో ఏదో అడిగార‌ని.. మీరు రాజ‌కీయాల్లోకి రావొద్దు. ఏపీలో రాజ‌కీయాలు అంత‌బాగాలేవు. నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు తిట్టుకుంటున్నారు. ఇప్పుడు మీరు వ‌చ్చినా తిడ‌తారు. ఆ గౌర‌వం పాడుచేసుకోవ‌ద్దు. అని చెబుతున్నారు. మ‌రి బ్ర‌ద‌ర్ వింటారా? విన‌రా? అనేది చూడాలి.