నన్ను ఆశీర్వదించండి..సరికొత్త ప్రయాణం మొదలుపెడుతున్న..ఐశ్వర్య సంచలన పోస్ట్..!!

కోలీవుడ్ లెజండ్ హీరో రజనీకాంత్..గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో, యాక్టింగ్ స్టైల్ తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న లెజండ్ హీరో. ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడటం లేదు కానీ..అప్పట్లో రజనీకాంత్ సినిమా వస్తే బోమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. అంత క్రేజ్ ఉంది ఆయనకు. ఇక రజనీకాంత్ కు ఇద్దరు కూతూర్లు అన్న సంగతి తెలిసిందే. ఐశ్వర్య రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్. ఈ మధ్యన రజనీ కూతురు ఐశ్వర్య తన భార్త కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడింది.

ఎవ్వరు ఊహించని విధంగా తమ 18 ఏళ్ళ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తూ..అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. అసలు వీళ్లు ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో..ఇప్పటి వరకు కూడా రీజన్స్ తెలియదు. కొందరు ఐశ్వర్య కి శింబుతో అఫైర్ ఉంది అంటుంటే..మరి కొందరు హీరోయిన్ తో ధనుష్ కి అక్రమ సంబంధం ఉంది అందుకే రజనీ డాటర్ డైవర్స్ ఇచ్చిందని పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ వీళ్ళ మధ్య అసలు ఏం జరిగిందో ఆ దేవుడికి.. వాళ్ళకే తెలియాలి. విడాకుల అనంతరం..నీ దారి నీది..నా దారి నాది అన్నట్లు పోతున్నారు ఈ జంట. విడిపోయిన తరువాత ఫ్రెండ్స్ గా ఉంటాం అని ప్రామిస్ చేసిన ఈ జంట..అలానే ఉన్నారు.

కాగా విడాకుల తరువాత ఐశ్వర్య దశ తిరిగిన్నట్లుంది, వరుస క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతుంది. కోలీవుడ్ చిత్రపరిశ్రమలో దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ విషయాని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వార అభిమానులతో పంచుకుంది. ఆమె పోస్ట్ చేస్తూ..” దర్శకురాలిగా బాలీవుడ్‏లో నా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నా. ఈ గుడ్ న్యూస్ మీతో పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ విషయం మీకు చెప్పడం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. “ఓ సాథీ చల్” అనే ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాను..నన్ను ఆశీర్వదించండి”అంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాను క్లౌడ్ నైన్ పిక్చర్స్ బ్యానర్ పై మీనూ ఆరోరా నిర్మించనున్నత్ళు తెలుస్తుంది. ఈ సినిమా కనుక విజయం సాధిస్తే..ఇక ఐశ్వర్యకి బాలీవుడ్ లో తిరుగుండదు అనే చెప్పాలి.

Share post:

Popular