తప్పేం లేదు..చరణ్ తో ఒక్కసారి అలా.. మాజీ ప్రేయసి కోరికలకు మెగా ఫ్యాన్స్ షాక్ ..!!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ గురించి..మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. సినీ చరిత్రలో ఆయన కంటూ సపరేటు పేజీని లిఖించుకున్న చిరు..అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఈ కుటుంబం నుండి ఎంత మంది హీరోలు వచ్చినా.. ఆయన వారసుడిగా వచ్చిన చరణ్ అంటే జనల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. తండ్రి పేరు చెప్పుకుని సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ మెగా వారసుడు.. ప్రస్తుతం టాప్ హీరోలల్లో ఒకరు గా ఉన్నారు.

రీసెంట్ గా దర్శక ధీరుడు రాజమౌళీ డైరెక్షన్ లో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాతో ఇండియన్ సినిమా చరిత్రను తిరగ రాశాడు చరణ్. సినిమాలో ఆయన నటనకు యావత్ దేశం ఫిదా అయ్యింది. కాగా, చరణ్ మొదటి సినిమా గుర్తుంది కదా..అదేనండి డాషింగ్ డైరెక్టర్ పూరీ కాంబో లో వచ్చిన “చిరుత”. మెగా వారుసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. సినిమా ఈ రేంజ్ హిట్ అవ్వడానికి చరణ్ డ్యాన్స్ ఓ రీజన్ అయితే మరో రీజన్ ఈ సినిమా హీరోయిన్.

అబ్బో.. చూసేకొద్ది చూడాలి అనిపించే అందం తో..అప్పట్లోనే కుర్రాళ్ల మతులు పోగోట్టింది. వచ్చి రాని తెలుగు లో ముద్దు ముద్దు గా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ..చరణ్ తో మాస్ డ్యాన్స్ ఇరగదీసింది. ఇక రీసెంట్ గా “నేహా శర్మ” ఓ ఇంటర్వ్యుల్లొ మాట్లాడుతూ..చాలా కాలం తరువాత తన హీరోని గుర్తు చేసుకుంది. ” చరణ్ చాలా మంచి వాడని..బాగా అర్ధం చేసుకుంటాడని. చరణ్ డ్యాన్స్ అంటే నాకు ఇష్టమని ..చెప్పుతూ..ఆయన తో ఇంకోసారి నటించాలని ఉందని..ఐటెం సాంగ్ అయిన పర్లేదు ..తప్పేం లేదు..కానీ ఒక్కసారి చరణ్ తో నటించాలి అని ఉంది”..అంటూ చెప్పుకొచ్చింది. మరి చూడాలి చరణ్ తన మాజీ ప్రేయసి కోరిక తీరుస్తాడా..లేదా..?