పవన్ సినిమాలో కృతి హీరోయినే..కానీ, షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన డైరెక్టర్ ..?

కృతి శెట్టి..అదృష్టానికి కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ప్రస్తుత పరిస్ధితులు చూస్తుంటే ఇదే మాట నిజం అంటున్నారు. అమ్మడు లక్ అలా తన వెంట పెట్టుకుని ఉంది. అమ్మడు నటించే సినిమాలో హిట్ అవుతున్నాయో..లేక ఆమె నటిస్తేనే సినిమాలు హిట్ అవుతున్నాయో తెలియడం లేదు కానీ..కృతి శెట్టి నటించిన ప్రతి సినిమా హిట్ అవుతుంది. అంతేకాదు ఆ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని..నిర్మాతలకు లాభలు తెచ్చిపెడుతుంది. ఇప్పటి వరకు ఆమె నటించిన మూడు సినిమాలు చూస్తే ఆ విషయం క్లీయర్ గా అర్ధమైపోతుంది.

ప్రస్తుతం అమ్మడి చేతిలో అర డజనుకి పైగా సినిమాలు ఉన్నాయి. అంతేకాదు ఈ సినిమాలను ఇంకా సెట్స్ పైకి పోనీవ్వకుండానే మరో క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె ఓకే చేసిన సినిమాలు కంటీన్యూ గా చేసుకుంటూ పోతే మరో రెండు.. మూడేళ్ళు బిజీ గా ఉంటుంది . అలా ఉన్న ఆమె కాల్ షీట్లను ఓ భారీ ఆఫర్ రావడంతో వాటిని అడ్జెస్ట్ చేసి..మరీ ఆ స్టార్ హీరో సినిమాలో నటీంచడానికి ఓకే చేసిందట.

ఇంతకి ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..ఇంకెవరు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రీ ఎంట్రీ తరువాత వరుస సినిమాలతో దూసుకుపోతున్న పవన్..ఈ మధ్యనే ఓ తమిళ మూవీని రీమేక్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇక ఆ సినిమాలో పవన్ తో పాటి మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నట్లు ఓ రేంజ్లో వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్ గా లెటేస్ట్ సెన్సేషన్ కృతి శెట్టిని తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బిజీ సెడ్యూల్స్ ఉన్నా కానీ పవన్ మూవీ అనే సరికి పాప తెగ సంబరపడిపోయి సినిమాకు కమిట్ అయ్యిందట. కానీ ఇక్కడ షాకింగ్ ట్వీస్ట్ ఏమిటంటే ఈ సినిమాలో పవన్ చెల్లెలుగా కృతి కనిపించనుందని టాక్ గట్టిగా వినిపిస్తుంది. మరి చూడాలి ఈ పవన్ చెల్లెలు ఎలాంటి విజయం అందుకుంటుందో..?

Share post:

Popular