ఓ షట్.. ప్రభాస్ టైం బ్యాడ్.. మరో భారీ ఎదురు దెబ్బ..?

పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ టైం ప్రస్తుతం బాగోలేన్నట్లు ఉంది. అటు ఆరోగ్యపరంగా..ఇటు సినిమాల పరంగా..అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. వందల కోట్లు పోసి తీసిన సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద అట్టర్ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకోగా..స్టీల్ బాడీ లా కనిపించే డార్లింగ్ హెల్త్ డ్యామేజ్ అయ్యిన్నట్లు తెలుస్తుంది.

“రాధేశ్యామ్” డిజాస్టర్ తరువాత మరో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఓ ఫైట్ సీన్ షూట్ చేసేటప్పుడు.. ప్రభాస్ కు గాయాలయ్యాయని తెలుస్తుంది. దీంతో చిన్న ఆపరేషన్ అవసరం ఉందట మన డార్లింగ్ ప్రభాస్ కి.

ఆపరేషన్ చిన్నదే అయినా గాయం మాత్రం చాల పెద్దది..చాలా జాగ్రత్తగా చూసుకోండి​ అంటూ డాక్టర్లు ప్రభాస్ కు పూర్తి బెడ్ రెస్ట్ ఇచ్చారట. దీంతో ప్రభాస్ అభిమానులు చాలా టెన్షన్ పడుతున్నారు. తమ అభిమాన దేవుడు త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నారు. ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన ప్రభాస్ హీరోగా నటించిన సినిమా “రాధేశ్యామ్” ఆయనకు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నెటిజన్స్ కొందరు ఆయనను నెట్టింట ట్రోల్ చేసుతున్నారు. వయసు అయిపోతుందిగా నొప్పులు భరించడం కాస్త కష్టమే..అంటు ఆయన వయస్సు పై కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. కింగ్ లా ఉండే ప్రభాస్ ఒక్కే ఒక్క సినిమాతో ఇలా నెట్టింట ట్రోలింగ్ కు గురి అవుతున్నారు.

Share post:

Latest