బాయ్‌ఫ్రెండ్‌తో టాలీవుడ్ హీరోయిన్ కి క‌ష్టాలు…!

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా కేవలం బాలీవుడ్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా టాలీవుడ్‌తో పాటు దేశ‌వ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల‌ను సొంతం చేసుకుంది అవికాగోర్‌. ఈ సీరియ‌ల్ ద్వారా ఆమెకు చిన్న వ‌య‌స్సులోనే ల‌క్ష‌లాది మంది అభిమానులు సొంతం అయ్యారు. ఈ సీరియ‌ల్ పాపులారిటీతోనే ఆమే ఏకంగా వెండితెర‌పై హీరోయిన్ అయిపోయింది. ఆమె తెలుగులో ఉయ్యాల జంపాలా – సినిమాచూపిస్త మావ, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి సినిమాల్లో న‌టించింది. ఈ సినిమాలో ప్రేక్ష‌కాదార‌ణ కూడా పొందాయి.

అయితే గ‌త కొంత కాలంగా ఆమె తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంటూ వ‌స్తోంది. ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మావ సినిమాల త‌ర్వాత బాగా బొద్దుగా మారిపోయిన అవికా ఫిజిక్ పూర్తిగా మారిపోయింది. అస‌లు ఆమె చిన్నారి పెళ్లికూతురేనా ? అన్న సందేహాలు వ‌చ్చేంత‌గా మారిపోయింది. అయితే ఇప్పుడు ఆమె బాడీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి ఎంతో క్యూట్‌గా మారిపోయింది.

ఈ క్ర‌మంలోనే ఆమె 10th క్లాస్ డైరీస్ సినిమాలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కొద్ది రోజులుగా ఈ ముద్దుగుమ్మ మిలింద్ చాంద్వానీ అనే వ్య‌క్తితో డేటింగ్‌లో మునిగి తేలుతోంది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసిన అవిక‌.. తాను ఎప్పుడు పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటే అప్పుడు పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పింది.

ఈ క్ర‌మంలోనే తన ప్రియుడు మిలింద్ గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. మిలింద్‌తో ప‌రిచ‌యం త‌ర్వాత పూర్తిగా త‌న యాట్యిట్యూడే మారిపోయింద‌ని చెప్పిన ఆమె.. త‌న జీవితంలోకి అత‌డు వ‌చ్చాక త‌న‌కు ఎంతో ఆత్మ‌విశ్వాసం కూడా పెరిగింద‌ని చెప్పింది. త‌న విష‌యంలో మిలింద్ ఎంతో కేర్ తీసుకుంటున్నాడ‌ని… అత‌డి కేరింగ్ వ‌ల్ల ఒక్కోసారి తాను కూడా క‌ష్టాలు ప‌డుతున్నాన‌ని.. మ‌న‌ల్ని న‌మ్మి ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకునే క్ర‌మంలో సాయ‌ప‌డే జీవిత భాగ‌స్వామి ప్ర‌తి ఒక్క‌రికి దొర‌కాల‌ని తాను కోరుకుంటున్న‌ట్టు అవికా చెప్పింది.