ఆ ఒక్క హీరోయిన్ విష‌యంలోనే ఎన్టీఆర్‌పై ఇన్ని రూమ‌ర్లా…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్లో ఎన్నో సినిమాల్లో నటించాడు ఈ క్రమంలోనే ఎంతో మంది హీరోయిన్లతో సినిమాలు చేశాడు. గ‌జాలా – ఆర్తి అగర్వాల్ – సోనాలి జోషి – త‌మ‌న్నా – అంకిత – భూమిక – ఇలియానా – సమంత – పూజా హెగ్డే- రకుల్ ప్రీత్ సింగ్ – కాజల్ అగర్వాల్ – రాశిఖన్నా – నివేదా థామస్ – శృతిహాసన్ – ప్రణీత కార్తీక – అమీషా పటేల్ – హన్సిక ఇలా చాలా మంది హీరోయిన్లతో ఎన్టీఆర్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశాడు. అయితే ఏ హీరోయిన్ విషయంలోనూ ఎన్టీఆర్ పై ఇలాంటి వార్తలు రాలేదు. పెళ్లికి ముందు… పెళ్లి తర్వాత కూడా ఎన్టీఆర్‌ ఇలాంటి వార్తలు ఎప్పుడు తన దరికి రాకుండా చూసుకున్నాడు.

అయితే ఒక్క హీరోయిన్ విషయంలో మాత్రం ఎన్టీఆర్ రూమర్ల వలలో చిక్కుకోక‌ తప్పలేదు. ఆ హీరోయిన్ ఎవరో కాదు సమీరారెడ్డి. సమీరా రెడ్డి తెలుగు అమ్మాయి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ సమీపంలోని అయితంపూడి. అయితే సమీరా రెడ్డి తండ్రి ముంబైలో ఉద్యోగరీత్యా స్థిరపడడంతో… ఆమె బాల్యం అంతా ముంబై లోనే గడిచింది. మోడలింగ్ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన స‌మీరా బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసి హాట్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకుంది.

ఇక తెలుగులో ఎన్టీఆర్ పక్కన నరసింహుడు – అశోక్ సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. అశోక్ సినిమాలో ఎన్టీఆర్ పట్టుబట్టి మరీ సమీరారెడ్డికి అవకాశం ఇప్పించాడు అన్న ప్రచారం కూడా అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది. అశోక్ సినిమాలో సమీరా నటిస్తున్న సమయంలో ఎన్టీఆర్ ఆమెకు ఒక ఖరీదైన కారు కూడా గిఫ్ట్ గా ఇచ్చాడ‌ని కూడా అప్పట్లో పుకార్లు వినిపించాయి. కారణం ఏదైనా అశోకు కూడా ఫ్లాప్ అవ్వడంతో ఆ తర్వాత ఎన్టీఆర్ – స‌మీరాఆ కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు.

ఆ త‌ర్వాత స‌మీరా మెగాస్టార్ చిరంజీవి జై చిరంజీవ సినిమాలో కూడా నటించింది. బాలీవుడ్లో ఆమె తళుక్కుమని మెరిసినా తెలుగులో మాత్రం ఆమె చేసిన సినిమాలు హిట్ అవ్వలేదు. ఇలా ఎన్టీఆర్ కెరీర్లో ఒక్క సమీరా రెడ్డితో మాత్రమే లింక‌ప్‌తో వార్తల్లోకి ఎక్కాడు. ఆ తర్వాత కొంత మంది హీరోయిన్లతో రిపీట్ గా సినిమాలు చేసినా ఇలాంటి వార్తలు ఎప్పుడూ రాలేదు.

Share post:

Latest