వామ్మో..ఈమెకు వంద కోట్ల ఆస్తి ఉందా..హేమ మాటలకు షాక్ అవుతున్న ఇండస్ట్రీ పెద్దలు..!!

ఎవ్వరైన సరే తాము సంపాదించేదాంతో కొంత డబ్బులు దాచుకోవాలని అనే చూస్తారు. రేపటి రోజు కోసం ఉపయోగపడుతుందని కొందరు.. పిల్లల చదువులకి, పెళ్లిలకు ఉపయోగపడుతుందని కొందరు..డబ్బును దాచుకుంటారు. ఇక ఈ రోజుల్లో సినీ ఇండస్ట్రీ లో ఉండే నటీ నటులు అయితే తమ పిల్లల కోసం కొన్ని వందల కోట్ల ఆస్తిని కూడబెడుతున్నారు. ప్రజెంట్ ఉన్న అందరు హీరోలు, హీరోయిన్లు కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నారన్న విషయం తెలిసిందే. దీంతో వాళ్ల ఆస్తులు విలువ కూడా కొన్ని వందల కోట్లు ఉంటాయి.

అయితే , ఇక్కడ అందరికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకునే ఆమె కూడా వంద కోట్లు విలువ చేసే ఆస్తి సంపాదించుకుందా అని డౌట్లు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆమె భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటుందని..సుమారు వంద కోట్ల ఆస్తి ఉందని..ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా చక్కర్లు కొడుతుంది. ఇక ఈ వార్త ఫైనల్ గా హేమ చెవిన పడింది. ఇక ఆమె ఊరుకుంటాదా..నో ఛాన్స్ ఉన్నది ఉన్నట్లు మాట్లాడే హేమ తన ఆస్తి వివరాలను బయట పెట్టేసింది.

వంద కోట్ల ఆస్తి వార్త పై స్పందిస్తూ..”నాకు వందల కోట్ల ఆస్తి అయితే లేదు కానీ..ఉన్న వరకు నాకు ఆస్తులు బాగానే ఉన్నాయి. నా బిడ్డను సెటిల్ చేసే అంత ఆస్తి అయితే నా దగ్గర ఉంది. ఆ విషయంలో నేను దిగులు చెందాల్సిన పనిలేదు. ఒక్కప్పుడు వేలల్లో రెమ్యూనరేషన్ తీసుకునే నేను ఇప్పుడు లక్షల్లో తీసుకుంటున్నాను. మొదటి నుండి కూడా నాకు డబ్బు విలువ బాగా తెలుసు అందుకే ఎక్కువ ఖర్చు చేయను. చాలా పొదుపుగా వాడుతా. నేను సంపాదించిన ప్రతి రూపాయిని జాగ్రత్తగా పొదుపు చేస్తా. ఒక్కప్పుడు సినిమాల్లో యాక్ట్ చేస్తూ డబ్బులు సంపాదించాను..ఇప్పటికీ మంచి మంచి రోల్స్ చేస్తూ సంపాదిస్తూనే ఉన్నాను, ఇంకా కూడా సంపాదిస్తా అంటూ తన ఆస్తి రూమర్ల పై క్లారిటీ ఇచ్చింది. కాగా హేమ ఇలా ఓపెన్ గా చెప్పడం చూసి ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు షాక్ అవుతున్నారు. కొందరైతే నిజంగానే 100కోట్ల ఆస్తి ఉంది ఏమో..కావాలనే ఇలా దాచి చెప్పుతుంది అంటున్నారు. అస్సలు హేమకు 100 కోట్ల ఆస్తి ఉందో లేదో ఆ దేవుడికి ఆమెకు మాత్రమే తెలియాలి..?