అప్పుడు మెగా స్టార్..నిన్న సూపర్ స్టార్ ..నేడు పాన్ ఇండియన్ స్టార్..ఎందుకంటారా !

అధికారంలో ఉన్న పొలిటీషియన్ ను, ఫామ్ లో ఉన్న హీరోను ఫాలో అయితేనే మనకు మేలు అంటాడు పోసాని ఓ సినిమాలో. ఇదే పద్దతిని పాటిస్తాయి చాలా మల్టీ నేషనల్ కంపెనీలో.. మంచి ఫామ్ లో ఉన్న స్టార్స్ తోనే తమ ఉత్పత్తుల ప్రచారానికి వాడుకుంటాయి. ఎప్పటికప్పడు తమ బ్రాండ్ అంబాసిడార్లను మారుస్తూ ఉంటాయి. వాస్తవానికి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో పాటు చాలా కమర్షియాల్ యాడ్స్ చేస్తుంటాడు. ఇప్పటికే పలు బ్రాండ్లను ఆయన ప్రమోట్ చేస్తున్నాడు. మహష్ నటించిన థమ్సప్ యాడ్ ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

- Advertisement -

తాజాగా ఈ యాడ్ లోకి కొత్త హీరో వచ్చాడు. ప్రస్తుతం థమ్సప్ యాడ్లో రౌడీ హీరో కనిపించాడు. తాజాగా ఈ యంగ్ హీరో పాన్ ఇండియన్ స్టార్ గా మారుతున్నాడు. లైగర్ సినిమాతో పాన్ ఇండియన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన పాపులారిటీని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది కోకాకోలా కంపెనీ. ఈ విషయాన్ని విజయ్ అఫీషియల్ గా ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు. ఇందులో విజయ్ న్యూ లుక్ లో కనిపిస్తున్నాడు. అటు యాడ్ లో ఇప్పటి వరకు ఉన్న టేస్ట్ ది థండర్ అనే ట్యాగ్ లైన్ కూడా మార్చేశారు. సాఫ్ట్ డ్రింక్ కాదిది.. తుఫాన్ అనే లైన్ ను యాడ్ చేశారు. ఈ యాడ్ త్వరలోనే టీవీలో సందడి చేయనుంది.

వాస్తవానికి తెలుగులో ఈ యాడ్ ముందుగు మెగాస్టార్ చిరంజీవితో మొదలయ్యింది. అప్పట్లో చిరంజీవి నటించిన ఈ యాడ్ తెలుగు నాట బాగా పాపులర్ అయ్యింది. తెలుగు నాట ఈ బ్రాండ్ వ్యాల్యూ బాగా పెరిగింది. అనంతం ఈ యాడ్ ను ప్రిన్స్ మహేష్ బాబు చేశాడు. ఆయన కూడా ఈ యాడ్ ద్వారా బాగానే ప్రచారం చేశాడు. హాలీవుడ్ సినిమా రేంజిలో ఈ యాడ్ ను రూపొందించాడు. విజయ్ యాడ్ ఏ రేంజిలో ఆకట్టుకుంటుందో చూడాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయకతప్పదు.

Share post:

Popular