స‌న్ ఆఫ్ ఇండియా ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్‌…మరి ఇంత దారుణమా..?

క‌లెక్షన్ కింగ్ మోహన్ బాబు సన్నాఫ్ ఇండియా సినిమా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. విడుదలకి ముందే ఈ సినిమాపై ఏ మాత్రం బ‌జ్ లేదు. అస‌లు ఈ సినిమాను కొనేందుకు కూడా ఎవ్వ‌రూ ముందుకు రాలేదు. దీంతో నిర్మాత మంచు విష్ణు సొంతంగా స‌న్ ఆఫ్ ఇండియాను రిలీజ్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి. ఇక తొలి రోజు 350 థియేట‌ర్ల‌లో ఈ సినిమా రిలీజ్ చేయాల‌ని అనుకున్నా జ‌నాలు లేక కేవ‌లం 250 థియేట‌ర్ల‌లోనే షోలు వేశారు.

ఈ షోల‌కు కూడా జ‌నాలు రాలేదు. వంద‌ల షోలు క్యాన్సిల్ చేశారు. చివ‌ర‌కు భ‌యంక‌ర‌మైన నెగిటివ్ టాక్ రావ‌డంతో పాటు సోష‌ల్ మీడియాలో కూడా బాగా నెగ‌టివిటి స్ప్రెడ్ అయ్యింది. దీంతో ఏపీ, తెలంగాణ‌లో తొలి రోజు రు. 6 ల‌క్ష‌ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ సినిమా శ‌ని, ఆదివారాల్లో మ‌రింత డీలా ప‌డింది. ఫ‌స్ట్ వీకెండ్ ముగిసే స‌రికి కేవ‌లం రు. 12 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు మాత్ర‌మే రాబ‌ట్టింది. ఇక ఒక్క కృష్ణా జిల్లాలో మాత్ర‌మే ఈ సినిమాకు చెప్పుకోద‌గ్గ‌ట్టుగా మూడో రోజు రు. 10 వేల షేర్ వ‌చ్చింది.

దీంతో కృష్ణాలో మాత్ర‌మే ఈ సినిమాకు మూడు రోజుల‌కు రు. 45 వేల షేర్ వ‌చ్చింది. ఇక సోమ‌వారం నాటికి ఈ సినిమా ఆడుతోన్న థియేట‌ర్ల‌ను లేపేశారు. ఇక మూడు రోజుల‌కే ఈ సినిమా ఫైన‌ల్ బాక్సాఫీస్ ర‌న్ ముగియ‌డంతో ఇది చ‌రిత్ర‌లోనే పెద్ద డిజాస్ట‌ర్ అని చెప్పాలి. అస‌లు మోహ‌న్‌బాబు క్రేజ్ త‌గ్గిపోవ‌డం, మంచు ఫ్యామిలీ (మ‌నోజ్ మిన‌హా) అతి కూడా ఈ సినిమాకు ముందే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వ‌డానికి కార‌ణం అయ్యాయి.

Share post:

Popular