పాపం నాగశౌర్య.. ఇలా ఉందేంటో ఇతడి పరిస్థితి

హీరోలకి ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం ఎలాంటి కథలను ఎంచుకోవాలో అవగాహన కూడా ఉండాలి. ఇలా టాలెంట్ ఉండి కథల విషయంలో జాగ్రత్త పడనప్పుడు కెరియర్ కొలాప్స్ కావడం తప్పదు. ఇక ఇప్పుడు యువ హీరో నాగ శౌర్య విషయంలో ఇదే జరుగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం టాలెంట్ ఉన్న యువ హీరోగా నాగ శౌర్య కు మంచి గుర్తింపు ఉంది. అయితే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నాగశౌర్యకు అశ్వద్ధామ సినిమా ఒక మోస్తరు విజయాన్ని అందించింది. ఇక ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు ఈ హీరో. ఇక ఇటీవలే వరుడు కావలెను అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నిరాశే ఎదురయింది.

ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది. కానీ అనుకున్నంత ఆదరణ మాత్రం సినిమాకు లభించలేదు. అయినా పట్టువదలని నాగశౌర్య ఈసారి హిట్ కొట్టాలని ఎంతో కష్టపడ్డాడు. తనని తాను కొత్తగా ప్రేక్షకులకు చూపించాలి అనుకున్నాడు. దీంతో లవర్ బాయ్ లా కనిపించే నాగశౌర్య కండల వీరుడిగా మారిపోయాడు. సిక్స్ ప్యాక్ కాదు ఏకంగా 8 ప్యాక్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. లక్ష్యా అనే స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా భిన్నమైన టాక్ సొంతం చేసుకుంది. ఇక అటు వసూళ్లలో అయితే నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది అనేది తెలుస్తుంది.

6 కోట్ల టార్గెట్ తో థియేటర్ లో విడుదలైన ఈ సినిమా.. కనీస వసూళ్లు సాధించలేక బొక్కబోర్లా పడిపోయింది లాంగ్ రన్ లో బాక్సాఫీస్ వద్ద కేవలం 1.85 కోట్ల షేర్ ను.. ఇక 3.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టగలిగింది నాగశౌర్య లక్ష్యా సినిమా. అంటే ఈ సినిమా వల్ల అటు నిర్మాతలకు 4.15 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇక నాగశౌర్య కెరీర్పై కూడా ఈ సినిమా గట్టిగానే దెబ్బకొట్టింది అన్నది అర్ధమవుతుంది. ఈ సినిమా కోసం నాగశౌర్య చేయాల్సినంత చేశాడు. కానీ ఏం చేస్తాం కథ బాగా లేనప్పుడు.. ఏం చేసినా ఎంత కష్టపడినా వృధానే కదా.. అది లక్ష్యా సినిమా విషయంలో నిజమైంది అని చెప్పాలి.