ఒక్క సినిమాకు రెండు విడుదల తేదీలు ఎందుకయ్యా మహాప్రభూ!

సాధారణంగా రాజమౌళి తెరకెక్కించిన సినిమాలు ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సృష్టిస్తూ ఉంటాయి అని చెబుతూ ఉంటారు. ఇప్పుడు వరకు ఇది జరిగింది కూడా. ఇప్పుడు కూడా రాజమౌళి కొత్త ట్రెండ్ సృష్టించాడు. అయితే ఒకప్పటిలా సినిమాలతో కాదు విడుదల తేదీలతో. సాధారణంగా ఒక సినిమాకి ఒక విడుదల తేదీని ప్రకటించడం ఇప్పుడు వరకు జరిగింది. ఒకవేళ ఆ సినిమా వాయిదా పడితే ఇక మరో విడుదల తేదీని ప్రకటించారు. కానీ ఇటీవలే అనూహ్యంగా ఎప్పుడూ లేని విధంగా రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాకు రెండు విడుదల తేదీలు ప్రకటించారు.

 

మార్చి 18 లేదా మార్చ్ 28 తేదీల్లో త్రిబుల్ ఆర్ సినిమా విడుదల చేస్తామని ప్రకటించారు. ఇక ఆ తర్వాత ఈ రెండు తేదీలను కాదని మార్చి 25వ తేదీన విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అంతా బాగానే ఉంది కానీ రాజమౌళి 2 సినిమా రిలీజ్ డేట్లు ప్రకటించడం ట్రెండ్ అనుకున్నారేమో.. అందరు హీరోలు కూడా ఇదే చేయడం మొదలు పెడుతున్నారు. ఇక ఇప్పుడు ఎన్నో సినిమాలు రాజమౌళి బాటలోనే 2 రిలీజ్ డేట్ లతో ప్రేక్షకులను కన్ఫ్యూజన్లో పడేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ముందు అనుకున్న ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ ఒకటో తేదీలలో భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తామని చిత్రబృందం ప్రకటించింది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న గని సినిమాకు కూడా 2 రిలీజ్ డేట్స్ రావడం గమనార్హం. ఫిబ్రవరి 25 లేదా మార్చి 4 వ తేదీలలో గని సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. రామారావు ఆన్ డ్యూటీ సినిమాని కూడా రెండు డేట్లను లాక్ చేయడం గమనార్హం. మార్చి 25 లేదా ఏప్రిల్ 15వ తేదీన సినిమాలను విడుదల చేస్తాం అంటూ ప్రకటించడం గమనార్హం ఇలా రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమా కి 2 రిలీజ్ డేట్స్ ప్రకటించడం వల్ల.. ఇప్పుడు టాలీవుడ్లో ఇదే కొత్త ట్రెండ్ మారిపోయింది అన్నది అర్ధమవుతుంది. ఇక ఈ రెండు తేదీలలో ఏ రోజు సినిమా వస్తుందో తెలియక అభిమానులు కూడా కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు.

Share post:

Latest