AK 61 : ఒక్క సినిమా.. కిక్కేక్కించే కాంబినేషన్!

సాధారణంగా స్టార్ హీరోల సినిమాల డేట్స్ కోసం దర్శక నిర్మాతలు అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ డైరెక్టర్ టేకింగ్ నచ్చింది అంటే స్టార్ హీరోలే పిలిచి మరి చాన్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు తమిళ స్టార్ హీరో అజిత్ ఒక్క దర్శకుడికి ఇలాంటి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. హిందీ హిట్ మూవీ పింక్ తమిళ రీమేక్ నేర్కొండ పార్వై సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు కోలీవుడ్ స్టార్ అజిత్. ఆ తర్వాత ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా నిర్మాత బోనీకపూర్ దర్శకుడు హెచ్ వినోద్ తో వాలిమై సినిమాకు ప్లాన్ చేశాడు.

ఈ సినిమా అజిత్ కెరీర్ లో 60 వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది ఇక ఈ సినిమాలో టాలీవుడ్ యువ హీరో కార్తికేయ పవర్ఫుల్ విలన్ పాత్రలో నటిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల అయ్యింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులందరిలో ఊహించని రేంజిలో అంచనాలు పెంచేసింది. సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తుంటే వరుసగా విడుదల వాయిదా పడుతూ నిరాశ పరుస్తుంది. ఎట్టకేలకు ఫిబ్రవరి 24వ తేదిన విడుదలకు సిద్ధమయింది అజిత్ సినిమా. అయితే వాలిమై దర్శకుడు హెచ్ వినోద్ టేకింగ్ అజిత్ కి బాగా నచ్చేసిందట.

ఎంతోమంది దర్శకులు అజిత్ డేట్స్ కోసం వెయిట్ చేస్తుంటే వినోద్ తోనే తన 61వ సినిమా చేసేందుకు ఫిక్స్ అయ్యాడట అజిత్. ఈ క్రమంలోనే బోనికపూర్, హెచ్ వినోద్ అజిత్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందట. ఇక ఈ సినిమాలో అగ్రతారల ను భాగం చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఈ క్రమంలోనే బాలీవుడ్ మెగా స్టార్ మోహన్ లాల్ టాలీవుడ్ కింగ్ నాగార్జున ల ను కీలక పాత్ర కోసం అప్రోచ్ అయ్యారట నిర్మాత బోనీకపూర్. వీళ్ళు మాత్రమే కాకుండా ఇక ఈ సినిమాలో అజిత్ క్రేజ్ కి తగ్గట్టుగా భారీ తారాగణాన్ని పెట్టుకోవాలని అనుకుంటున్నారట. ఇక ఈ సినిమాలో అజిత్ సరసన అతిధి రావు హైదరి హీరోయిన్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. మార్చ్ 9వ తేదీ నుంచి సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.