భీమ్లా నాయక్ సినిమాలో నిత్యా మీనన్ కు అన్యాయం జరిగిందా ?

భీమ్లా నాయక్.. మొత్తానికి మంచి విజయాన్నే అందుకుంది. అంచనాలను అనుగుణంగా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక సినిమాకు సంబంధించిన పలు విషయాలను పక్కన పెడితే.. నిత్యా మీనన్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సినిమాలో నిత్యా మీనన్ తో పాటు సంయక్త మీనన్ అనే మరో కేరళ నటి కూడా యాక్ట్ చేసింది. తను కూడా మంచి నటన కనబర్చింది. అయితే కీ రోల్ మాత్రం నిత్యా మీనన్ దే. ఈ రీమేక్ సినిమా అయ్యప్పనుం కోషియం. ఈ సినిమాలోని క్యారెక్టర్ తో పోల్చితే భీమ్లా నాయక్ సినిమాలో కాస్త ఎక్కువ నిడివి పెంచారు. కథలోని ఇంపార్టెన్స్ ను కూడా పెంచారు. కానీ.. సినిమా యూనిట్ తో నిత్యకు ఏదో విబేధాలు వచ్చినట్లుంది. అందుకే ఆ పాత్ర పట్ల ఇంట్రెస్ట్ కనిపించలేదు. ఆమె మేకప్, హెయిర్ స్టైల్ చాలా అబ్ నార్మల్ గా ఉన్నాయి. అసలు సినిమాలోని పాత్రకు, ఈ సినిమాలోని పాత్రకు అస్సలు పొంతనే ఉన్నట్లు అనిపించదు. మేకప్ విషయంలో మలయాళ, తెలుగు దర్శకుల మధ్య ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. పాత్రకు తగినట్లుగా మేకప్, కాస్ట్యూమ్స్ ఉండాలి. అందుకు తగినట్లుగానే లుక్ ఉండాలి. ఈ సినిమాలో పాత్రకు, నిత్యా కనిపించే లుక్ కు అసలు పొంతనే ఉండదు.

అటు సంగీతం విషయంలో తమన్ ఏ సోయిలో ఉండి కొట్టాడో అనిపిస్తుంది. వింత పదాలతో పాటు, వ్యక్తీకరణలు పెట్టాడు. అంత ఇష్టం ఏందయ్యా నీకు పాటను చిత్ర మాత్రం బాగా పాడింది. ఇదే పాట సినిమాలో ఉంటే బాగుండేది. కాస్త రిలీఫ్ అయ్యేవాళ్లు జనాలు. నిత్యా మీనన్ మీద కోపం కారణంగా ఈ పాటను ఎత్తేసినట్లు తెలుస్తోంది. ఎందుకు కట్ చేశారు? అంటే సినిమా లెన్త్ ఎక్కువైందని చెప్పారు. వాస్తవానికి సినిమాపెద్దగా అయితే.. సెకెండ్ ఆఫ్ లోని ఫైట్లు కాస్త తగ్గించిన పెద్ద ఇబ్బందేం ఉండేది కాదు. కానీ కావాలనే ఈ పాటను ఎత్తేశారని అర్థం అవుతుంది.

ఈ సినిమా ఫస్టాఫ్ లో రానా హైలెట్ అయ్యాడు. సెకెండాఫ్ లో పవన్ ను హైలెట్ చేయడానికి దర్శకుడు చాలా ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే నిత్య పాత్ర ఎగిరిపోయింది. అర్థాంతరంగా ఈ పాత్ర ఎటుపోయిందో త్రివిక్రమ్ కే తెలియాలి. అయితే నిత్యా మీనన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా రాలేదు. ఎందుకు? అని పరిశీలిస్తే.. ఆమెకు, సినిమా యూనిట్ కు మధ్య ఏదో జరిగింది అని మాత్రం అర్థం అవుతుంది.