నిర్మలమ్మ కుటుంబం గురించి మీకు ఎంతవరకు తెలుసు?

అనగనగా 40 ఏళ్ల క్రితం.. సినిమా ఇండస్ట్రీలో ఆమె ఒక అమ్మ ఎంతోమంది హీరోలకు ఆమె అమ్మమ్మ కేవలం హీరోలకేనా ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడికి ఆమె నానమ్మ. అవును మరి ఆమె చేసిన నటన పాత్రలు అలాంటివి. అందరూ హీరోయిన్గా చేసి ఆ తర్వాత అమ్మమ్మ నాన్నమ్మ క్యారెక్టర్లు చేయడం చూస్తూ ఉంటారు. ఆమె ఎంట్రీ ఇవ్వడమే అమ్మమ్మ అమ్మలాంటి క్యారెక్టర్లతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ప్రతి పాత్రలో ఒదిగిపోయి ఆమె నటించే తీరు అచ్చంగా మన ఇంట్లో ఉండే నాన్నమ్మ అమ్మమ్మ లను గుర్తు చేసేది ప్రేక్షకులకు. ఇలా తెలుగు ప్రేక్షకుల హృదయాలను దగ్గరైన ఆమె చెరగని ముద్ర వేసుకున్నారు.

ఇంతకీ ఆమె ఎవరు అని అనుకుంటున్నారు కదా.. ఆమె ఎవరో కాదు నిర్మలమ్మ. సూపర్ స్టార్ కృష్ణ దగ్గర నుంచి మెగాస్టార్ వరకు ఎంతోమందికి తల్లి పాత్రలో నటించింది. ఇలా టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసుకున్న నిర్మలమ్మ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చిన్నప్పుడు నుంచి నిర్మల్ అమ్మకు నాటకాలంటే మక్కువ.. ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్ల పాటు పేజి ప్రదర్శనలు ఇస్తూ వచ్చారు ఆమె. ఇలా నాటకాల్లో చేస్తున్న సమయంలోనే నిర్మలమ్మ గారి వెంట జి.వి.కృష్ణారావు పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడేవాడు. కొన్నాళ్లపాటు పెళ్లి ఇష్టం లేదు అని చెప్పిన నిర్మలమ్మ.. ఆ తర్వాత నాటకాలకు దూరం చేయవద్దు అంటూ షరతులు పెట్టి పెళ్లి చేసుకున్నారట.

పెళ్ళయ్యాక వీరికి పిల్లలు పుట్టక పోవడం తో ఎంతగానో బాధ పడిపోయేవారట నిర్మలమ్మ. ఇక ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉండడం మొదలు పెట్టారు. ఆ తర్వాత కాలంలో మళ్లీ నాటక రంగంపై దృష్టి పెట్టి ఎన్నో నాటకాలు వేశారు నిర్మలమ్మ.. కొన్నాళ్ళకి మళ్లీ నటనపై మక్కువ తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ నుంచి మొన్నటి నాగార్జున వరకు ఎంతో మంది సినిమాల్లో నటించారు. నిర్మలమ్మ కు పిల్లలు కాకపోవడంతో కవిత అనే ఆడ పిల్లను దత్తత తీసుకున్నారు. నిర్మలమ్మకు ఒక మనవడు కూడా ఉన్నాడు. అతని పేరు విజయ్ మాదాల. అయితే తన మనవడు విజయ్ తన వారసుడిగా ఇండస్ట్రీ పడమటిసంధ్యారాగం అనే సినిమాతో హీరోగా పరిచయం చేశారు నిర్మలమ్మ. కానీ ఈయన ఇండస్ట్రీలో ఇమడలేకపోయారు. ఇక ప్రస్తుతం పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయారు నిర్మలమ్మ మనవడు విజయ్.