నాని సినిమాకు ఏకంగా ఏడు రిలీజ్ డేట్లు..

నేచురల్ స్టార్ నాని. ఆయన ఏది చేసినా కొత్తగానే ఉంటుంది. తాజాగా తెలుగు సినిమా పరిశ్రమలో ఓ కొత్త ట్రెండ్ మొదలయ్యింది. ఒకే సినిమాకు రెండు రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్నారు. ఒకటి కాకపోతే ఇంకోటి.. ఏదో ఒక తేదీన సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు. తాజాగా పలు సినిమాలకు రెండు రిలీజ్ డేట్లు విడుదల అయ్యాయి కూడా. ఇక నాని కొత్తగా ఓ ట్రెండ్ మొదలు పెట్టాడు. మీరంతా రెండు డేట్లు ప్రకటిస్తే.. తాను మాత్రం ప్రకటించకూడదా? అంటూ ఏకంగా ఏడు రిలీజ్ డేట్లు వెల్లడించాడు. వామ్మో నాని బాగా ముదురు అనే టాక్ వినపడుతోంది.

వాస్తవానికి నానికి చెందిన రెండు సినిమాలు గతేడాది ఫ్లాప్ అయ్యాయి. అది కూడా థియేటర్లలో రిలీజ్ కాకుండా.. ఓటీటీలో విడుదలయ్యాయి. తాజాగా తను నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా సౌత్ లోని అన్ని భాషల్లో విడుదల అయ్యింది. ఇప్పుడు అదే ఊపుతో వరుస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా అంటే సుందరానికి అనే సినిమా చేస్తున్నాడు. పక్కా ఫన్ లైన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ అవుతుంది. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి మంచి సినిమాలు తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నజ్రియా హీరోయిన్ గా చేస్తుంది.

అయితే ఈ సినిమాకు ఏకంగా 78 రిలీజ్ డేట్లు ప్రకటించారు. మీరంతా రెండు రెండు డేట్లు బ్లాక్ చేస్తే మేం ఏడు చేయకూడదా? అంటూ నానీ ఫన్నీగా ట్వీట్ చేశాడు. తాజాగా ఓ పోస్టర్ మీద ఈ ఏడు డేట్లను వెల్లడించాడు. ఏప్రిల్ 22, 298, మే 6, 20, 27, జూన్ 3, 10 తేదీల్లో ఈ సినిమా విడుదల అవుతుందని వెల్లడించాడు. ఫుల్ ఆవకాయ సీజన్ బ్లాక్డ్.. మెల్లగా డిసైడ్ చేస్తాం అంటూ రాసుకొచ్చాడు నాని.