ఆ హీరోయిన్‌ని వ‌దిలే ప్రసక్తే లేదంటున్న నాగ్ అశ్విన్‌..స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడుగా..?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కి ఎంతో మంది డైరెక్టర్లుగా వస్తుంటారు పోతుంటారు. కానీ కొంతమందే అలా వచ్చి ఇండస్ట్రీలో పాతుకు పోతారు. వాళ్ళ పేరుని తరతరాలు గుర్తుంచుకునేలా చేస్తారు. అలాంటి వారిలో ఈ నాగ్ అశ్విన్ కూడా ఒకరు. ఢిఫరెంట్ స్టైల్ లో సినిమాలు తెరకెక్కించడం ఈయన స్పెషాలిటీ. ఇతర డైరెక్టర్ సినిమాలల్లో లేని కొత్త దనం ఈయన సినిమాల్లో మాత్రమే కనిపిస్తుంది అంటారు కొందరు నెటిజన్స్. అలాంటి ఓ మార్కును తన సినిమాల ద్వార చూపించగలుగుతారు అశ్విన్. నిజానికి నేటితరంలో ఇలాంటి దర్శకులు దొరకడం చాలా రేర్. ఉన్న ఒక్క పీసే ఈ నాగ్ అశ్విన్. వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ అల్లుడిగా ప్రియాంక దత్ భర్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. చేసింది తక్కువ సినిమాలే కానీ తన ఇంపాక్ట్ మాత్రం బాగానే చూపించాడు.

నాని హీరోగా వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తరువాత పిట్ట కధలు అనే సినిమా తీసాడు ..అది పెద్దగా సక్సెస్ కలేదు. ఇక ఆ తరువాత సావిత్రి గారి బయోపిక్ తీసి మహానటి అంటూ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతా లో వేసుకున్నాడు. ఈ సినిమాతో నాగ్ అశ్విన్ పేరు మారు మ్రోగిపోయింది. ఆ తరువాత నిర్మాతగా జాతి రత్నాలు తీశాడు. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాల్లో ఒకదానికి ఒకటి పొంతన ఉండదు. వేటికవే చాలా విభిన్నవైనవిగా మంచి పేరు సంపాదించుకున్నాయి. ప్రజెంట్ టాలీవుడ్‌లో ఉన్న స్టార్ ద‌ర్శ‌కుల్లో నాగ్ అశ్విన్ కూడా ఒక‌రు.

ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో కలిసి ప్రాజెక్ట్ K అనే చిత్రాని తెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించనుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇక నాగ్ అశ్విన్ ఈ సినిమాను 500కోట్ల భారీ బడ్జేట్ తో ప్రాజెక్ట్ K తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా లీక్ అవుతున్న సమాచరం బట్టి ఈ సినిమాలో మరో కీలక పాత్రలో మాల‌విక నాయ‌ర్‌ని ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. నాగ్ అశ్వీన్ తీసే ప్రతి సినిమాలోను అమ్మడుకి ఓ ఆఫర్ ఇస్తున్నాడు ఈయన. మొదట నాని పక్కన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించింది. ఆ తరువాత..మహానటి సినిమాలో జెమినీ గ‌ణేష‌న్ మొద‌టి భార్య పాత్ర‌లో నటించింది. ఇక ఇప్పుడు ప్రభాస్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఇవన్ని చూస్తుంటే అశ్వీన్ ఈ అమ్మడుని వదిలేలా లేరు అంటున్నారు నెటిజన్స్. మరి చూడాలి మూడో సారి వచ్చిన ఈ ఆఫ‌ర్ అమ్మడుకి ఎలాంటి విజయం అందిస్తుందో..?