మహేష్ ,త్రివిక్రమ్ సినిమా .. కీలక పాత్రలో మరొక స్టార్ హీరో !

హారిక హాసిని క్రియేషన్స్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ,మహేష్ బాబు కాంబినేషన్ లో లేటెస్ట్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే . అయితే ఇండస్ట్రీలో ఈ సినిమా కధ గురించి ఒక ఇంట్రెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది .అదేమిటంటే ఈ సినిమాలో ఒక కీలక రోల్ ఒకటి ఉన్నదంట.ఆ పాత్రకి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని సెలక్ట్ చేశారని టాక్ .ఇందులో మోహన్ లాల్ క్యారెక్టర్ ఒక పొలిటికల్ లీడర్ గా నటిస్తున్నాడట .అయితే చిత్ర బృందం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు .

ఖలేజా సినిమా తరువాత మహేష్ బాబు తో త్రివిక్రమ్ చేస్తున్న చిత్రం ఇదే .దాదాపు 11 ఇయర్స్ తరువాత వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం.ఈ సినిమా లో మహేష్ సరసన ఇప్పుడు క్రేజీ హీరోయిన్ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది .పూజ హెగ్డే మహేష్ తో రెండో సినిమా చేస్తుంది .వంశి పైడిపల్లి డైరెక్షన్ లో వచ్చిన మహర్షి సినిమాలో మహేష్ బాబు సరసన నటించింది .

Share post:

Latest