క‌త్రినా కైఫ్ భ‌ర్త విక్కీ కౌశ‌ల్ బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

ముదురు ముద్దుగుమ్మ క‌త్రినా కైఫ్ బాలీవుడ్‌ను రెండు ద‌శాబ్దాల పాటు ఏలేసింది. అప్పుడెప్పుడో 2000వ సంవ‌త్స‌రం టైంలోనే సినిమాల్లోకి వ‌చ్చిన క‌త్రినా తెలుగులో విక్ట‌రీ వెంక‌టేష్ ప‌క్క‌న మ‌ల్లేశ్వ‌రి చేసింది. రెండు ద‌శాబ్దాల పాటు బాలీవుడ్‌లో మ‌కుటంలేని మ‌హారాణిగా వెలుగొందినా కూడా క‌త్రినా అందం ఇప్ప‌ట‌కీ చెక్కు చెద‌ర్లేదు. త‌న మాజీ ప్రియుడు అయిన కండ‌ల హీరో స‌ల్మాన్‌ఖాన్‌తో మొద‌లు పెడితే క్రేజీ హీరోల‌తోనే ఆమె ప్రేమాయ‌ణం న‌డిపింద‌ని.. డేటింగ్‌లు చేసింద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. అయితే చివ‌ర‌కు త‌న‌కంటే వ‌య‌స్సులో చిన్న‌వాడు అయిన విక్కీ కౌశ‌ల్‌ను వివాహం చేసుకుంది.

క‌త్రినాను పెళ్లి చేసుకున్న విక్కీ కౌశ‌ల్ లైఫ్‌లో బాగా సెటిల్ అయ్యాడు. అలాగే క‌త్రినా లాంటి స్టార్ హీరోయిన్‌, అంద‌గ‌త్తెను పెళ్లాడినందుకు ఎంతో ఎగ్జ‌యిటింగ్‌గా ఫీల‌య్యాడు. విక్కీ బాలీవుడ్‌లోనే మోస్ట్ ప్రామీసింగ్ హీరోగా ఎదిగాడు. అత‌డు ఎదిగిన వైనం సాటి హీరోల‌కు కూడా చాలా స్ఫూర్తి అనే చెప్పాలి. యూరి లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలో విక్కీ న‌ట‌న‌కు ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అయిపోయారు.

ప్ర‌స్తుతం క‌త్రినాతో కూడా అత‌డు కలిసి న‌టిస్తున్నాడు. వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న విక్కీ బ్యాక్‌గ్రౌండ్ ఏంట‌న్న‌ది ఎవ‌రికి అయినా ఆస‌క్తి ఉంటుంది. విక్కీ తండ్రి బాలీవుడ్‌లో ప్ర‌ముఖ స్టంట్ మాస్ట‌ర్‌. షామ్ కౌశ‌ల్ మాస్ట‌ర్ అంటే ఎంతో పేరు ఉంది. చాలా పాపుల‌ర్ స్టంట్ మాస్ట‌ర్. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్ – క్రిష్ కాంబోలో వ‌స్తోన్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాకు ప‌ని చేస్తున్నాడు.

త‌న తాజా తెలుగు సినిమా అప్‌డేట్‌ను కూడా షామ్ వెల్ల‌డించారు. ఈ సినిమాకు సంబంధించి క్రిష్‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న ఫొటో కూడా సామ్ షేర్ చేశాడు. పవన్ కళ్యాణ్ సర్ తో హరి హర వీర మల్లు నెక్ట్స్ షెడ్యూల్ కోసం తాను రెడీ అవుతున్నాన‌ని చెప్పాడు. ఏఎం ర‌త్నం నిర్మాతగా ఉన్న ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌. ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక క‌త్రినా త‌మ ఇంటి కోడ‌లు అవ్వడంతో ఇప్పుడ షామ్ కౌశ‌ల్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడ‌ట‌.

Share post:

Latest