సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రేమాయణం అన్నది కామన్ అయిపోయింది. ఎంత పెద్ద హీరో, హీరోయిన్లు అయినా కూడా ప్రేమ వివాహమే చేసుకుంటున్నారు. ఇప్పుడు సినిమా వాళ్లకు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు అనేవి ఉండడం లేదు. ఈ లిస్టులోకే అఖిల్ హీరోయిన్ కూడా చేరిపోయింది. ఇంతకు అఖిల్ హీరోయిన్ ఎవరు ? ఆమె ఎవరితో ప్రేమలో పడిందో తెలుసుకుంటే కాస్త ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. అఖిల్ నటించిన హలో సినిమాలో హీరోయిన్గా నటించింది కళ్యాణి ప్రియదర్శిని.
హలో సినిమాతో హీరోయిన్గా పరిచయం అయినా కోలీవుడ్, మల్లూవుడ్‌లో కూడా ఆమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా చేసింది. తెలుగులో ఆ తర్వాత ఆమె చిత్రలహరి లాంటి సినిమాల్లో నటించినా ఆమె హలోలో నటించడంతో అఖిల్ హీరోయిన్‌గానే బాగా పాపులర్ అయ్యింది. ఇక కళ్యాణి తల్లిదండ్రులు కూడా ఇండస్ట్రీలో బాగా గుర్తింపు ఉన్నోళ్లే. తండ్రి ప్రియదర్శన్ ఫేమస్ డైరెక్టర్. జాతీయ స్థాయిలోనే ఆయనకు మంచి గుర్తింపు ఉంది. తెలుగుతో పాటు అటు బాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాలను డైరెక్ట్ చేశాడు.
తల్లి లిజీ ఒకప్పటి హీరోయిన్. వారి స్ఫూర్తితోనే కళ్యాణి సినిమాల్లోకి హీరోయిన్గా వచ్చింది. అయితే ఆమె తన బాల్య మిత్రుడితో ప్రేమలో పడింది. ఆ బాల్య మిత్రుడు ఎవరో కాదు మళయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్. ప్రణవ్ మంచి నటుడే కాదు గాయకుడు కూడా..! వీరిద్దరి ప్రేమకు కారణం.. ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న స్నేహ సంబంధాలే..!
ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న స్నేహంతోనే ప్రణవ్, కళ్యాణి బాల్య స్నేహితులు అయ్యారు. అలా ముందు నుంచి సన్నిహితంగా ఉన్న వీరు తర్వాత ప్రేమలో పడి ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరిద్దరి ప్రేమకు పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో వీరు హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి హృదయం సినిమా చేస్తున్నారు.