క‌ళ్యాణ్‌దేవ్‌కు ఆ హీరోయిన్‌తో ఎఫైర్‌.. అందుకే శ్రీజ‌కు విడాకులా…!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి ఎవరి పై ప్రేమ పుడుతుందో.. ఎప్పుడు ఎవరు ఎవ‌రితో ఎఫైర్లో ఉంటారో ? ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో ? ఎప్పుడు విడిపోతారో కూడా తెలియ‌దు. వైవాహిక జీవితం చాలా హ్యాపీగా ఉన్న జంట కూడా స‌డెన్‌గా విడాకులు తీసుకుని విడిపోవ‌డం అంద‌రికి షాక్ ఇస్తూ ఉంటుంది. అక్కినేని నాగ‌చైత‌న్య – స‌మంత జంట ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. మోస్ట్ రొమాంటిక్ క‌ఫుల్‌గా ఈ జంట‌కు పేరు ఉండేది. అలాంటి వీరు స‌డెన్‌గా విడాకుల ప్ర‌క‌ట‌న చేసి అంద‌రికి షాక్ ఇచ్చారు.

ఇక స‌మంత – చైతు విడాకుల త‌ర్వాత షాక్ ఇచ్చిన విడాకులు ఐశ్వ‌ర్య – ధ‌నుష్‌. వీరు కూడా 18 ఏళ్లు కాపురం చేశాక విడిపోతార‌ని ఎవ్వ‌రూ అనుకోలేదు. వీరి విడాకుల త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ – క‌ళ్యాణ్‌దేవ్ కూడా విడిపోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం అయితే జ‌రుగుతోంది. గత కొంతకాలం నుంచి కళ్యాణ్ మెగా కుటుంబంతో కలవకపోవడం.. పైగా త‌న సినిమాలు వ‌దిలేసి.. ఇత‌ర హీరోల సినిమాలు మెగా కాంపౌండ్ హీరోలు ప్ర‌మోష‌న్ చేయ‌డం కూడా ఈ అనుమానాల‌కు తావిచ్చేలా ఉంది.

ఇక శ్రీజ క‌ళ్యాణ్‌దేవ్‌ను అన్‌ఫాలో కావ‌డంతో పాటు క‌ళ్యాణ్ ఫొటోలు కూడా పెట్ట‌డం లేదు. వీరిద్ద‌రు వేర్వేరుగా ఉంటున్నారు. పైగా శ్రీజ త‌న భ‌ర్త తీసేసి.. శ్రీజ కొణిదెల అని కూడా పెట్టుకుంది. ఇంత జ‌రుగుతున్నా మెగా కాంపౌండ్ కూడా ఎందుకు స్పందించ‌డం లేద‌న్న ప్ర‌శ్న‌కు మ‌రో న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. క‌ళ్యాణ్‌దేవ్ ఇండస్ట్రీలో ఓ యంగ్ హీరోయిన్‌తో ప్రేమ‌లో ఉన్నాడ‌ని.. అందుకే శ్రీజ‌కు దూరంగా ఉన్న‌ట్టు టాక్ ?

ఈ విష‌యం తెలిసిన శ్రీజ భ‌ర్త‌తో క‌లిసి ఉండ‌లేక దూరంగా ఉంటోంద‌ని.. ఆమే త‌న‌కు విడాకులు కావాల‌ని కోరిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌ళ్యాణ్‌దేవ్ ప్రేమాయ‌ణం న‌డుపుతోన్న ఆ హీరోయిన్ ఎవ‌రు ? అన్న‌ది తెలియ‌క‌పోయినా త‌ను న‌టించిన రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మ‌రో రెండు సినిమాలై లైన్లో ఉన్నాయి. మ‌రి త‌న సినిమాల్లో చేసిన హీరోయిన్‌తోనే క‌ళ్యాణ్ ఎఫైర్ పెట్టుకున్నాడా ? లేదా మ‌రో హీరోయినా ? అన్న‌ది బ‌య‌ట‌కు రాలేదు.