పవన్ లేకపోతే ఆ మాజీ మంత్రి మ‌ళ్లీ గెల‌వ‌డా…!

వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌తో పొత్తు ఉండాలని చాలామంది టీడీపీ నేతలు భావిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గోదావరి, కృష్ణా జిల్లాల తెలుగు తమ్ముళ్ళు పవన్‌పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే పవన్ విడిగా పోటీ చేస్తే చాలామంది టీడీపీ నేతలు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే…అదే పవన్ సపోర్ట్ ఇస్తే టీడీపీ నేతలు ఈజీగా గెలిచేస్తారు.

అయితే టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకుంటారా? లేదా? అనేది ఇప్పుడు క్లారిటీ వచ్చేలా లేదు. ఒకవేళ పొత్తు ఉంటే టీడీపీకి లాభం…లేకపోతే నష్టమనే చెప్పొచ్చు. ఇక పవన్ సపోర్ట్ లేకపోతే నష్టపోయే వారిలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా ఉంటారు. గతంలో కాంగ్రెస్‌లో పనిచేసి 2014 ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చిన పితాని, 2014 ఎన్నికల్లో ఆచంట నుంచి పోటీ చేసి కేవలం 4 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

అప్పుడు పవన్ కల్యాణ్, టీడీపీకి సపోర్ట్ ఇవ్వడం వల్ల పితాని గెలుపు సాధ్యమయిందని చెప్పొచ్చు. అప్పుడే పవన్ సపోర్ట్ లేకపోతే పితాని గెలుపు కష్టమయ్యేది. అయితే 2019 ఎన్నికల్లో కరెక్ట్‌గా అదే జరిగింది..పవన్ విడిగా పోటీ చేయడం వల్ల ఆచంటలో పితాని ఓడిపోయారు. ఎందుకంటే జనసేన పార్టీ ఓట్లు చీల్చడం వల్ల టీడీపీకి డ్యామేజ్ జరిగింది..వైసీపీకి లాభం జరిగింది.

గత ఎన్నికల్లో పితాని దాదాపు 12 వేల ఓట్ల మెజారిటీటు ఓడిపోగా, అదే ఆచంటలో జనసేనకు 14 వేల ఓట్ల వరకు పడ్డాయి. అంటే జనసేన ఓట్లు ఎలా చీల్చిందో అర్ధం చేసుకోవచ్చు…దీని వల్ల పితానికి నష్టం జరిగింది…నెక్స్ట్ ఎన్నికల్లో కూడా పవన్ ఒంటరిగా పోటీ చేస్తే…మళ్ళీ పితానికి నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదు. అందుకే టీడీపీ-జనసేనలు కలిస్తే బెటర్ అని ఓపెన్‌గానే మాట్లాడుతున్నారు. అంటే పొత్తు ఉంటేనే ఆచంటలో పితానికి గెలవడం సులువు అవుతుంది…లేదంటే పితానికి మళ్ళీ గెలవడం కష్టమే.