పూరి ‘ జ‌న‌గ‌ణ‌మ‌న ‘ స్టోరీ లైన్ ఇదే… హీరో కూడా ఫిక్సే…!

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగ‌ర్ సినిమా తెర‌కెక్కుతోంది. క‌రోనా వ‌ల్ల రెండేళ్లుగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోతూ వ‌స్తోంది. ఇటీవ‌లే ఈ సినిమాకు గుమ్మ‌డికాయ కొట్టేశారు. లైగ‌ర్ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కింది. ఈ సినిమాకు గుమ్మ‌డికాయ కొట్టేసిన సంద‌ర్భంగా పూరి జ‌గ‌న్నాథ్ జ‌న‌గ‌ణ‌మ‌న ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు.

- Advertisement -

జ‌న‌గ‌ణ‌మ‌న అనేది బిజినెస్‌మేన్ సినిమా త‌ర్వాత పూరి మ‌దిలోనుంచి పుట్టిన క‌థ‌. ఈ క‌థ‌ను పూరి సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు కోస‌మే రెడీ చేసుకున్నాడు. అయితే పూరి త‌న‌కు పోకిరి – బిజినెస్‌మేన్ లాంటి రెండు హిట్లు ఇచ్చినా కూడా పూరి అప్పుడు వ‌రుస ప్లాపుల్లో ఉండ‌డంతో మ‌హేష్ ఛాన్స్ ఇవ్వ‌లేదు. దీంతో పూరి ఓపెన్‌గానే బ‌ర‌స్ట్ అయ్యాడు.

ఇక ఇప్పుడు ఆ జ‌న‌గ‌ణ‌మ‌న క‌థ‌తోనే మ‌రోసారి విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఈ సినిమాకు సంబంధించి నాలుగేళ్ల క్రిత‌మే పూరి ఓ పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో దేశ‌భ‌క్తితో పాటు పూరి మార్క్ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయ‌ని తెలుస్తోంది. విజ‌య్ ఈ సినిమాలో సోల్జ‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు.

ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఓ రాష్ట్ర ప్ర‌భుత్వం అవినీతిలో కూరుకుపోయి ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెడుతోన్న టైంలో, సామాన్యుల హ‌క్కులు కాల‌రాస్తోన్న టైంలో సైన్యం రంగంలోకి దిగ‌డం, ఓ ఆర్మీ ఆఫీస‌ర్ వ్య‌వ‌స్థ‌ను ఎలా ట్రాక్‌లోకి ఎక్కించాడు అనే క‌థాంశంతో ఈ సినిమా ఉంటుంద‌ట‌. ఈ స్టోరీ లైన్ వింటుంటేనే ఎగ్జైట్మెంట్‌గా ఉంది. ఆగ‌స్టులో లైగ‌ర్ రిలీజ్ చేస్తున్నారు. ఆ త‌ర్వాత ఇది ప‌ట్టాలు ఎక్కే అవ‌కాశం ఉంది.

Share post:

Popular