బన్నీ ఫామ్‌హౌజ్‌లో ప్ర‌త్యేక‌మైన పూజాలు..మెగా అభిమానుల్లో టెన్షన్..?

అల్లు వారి అబ్బాయి..స్టార్ ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్..గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తందైన స్టైల్ లో సినిమాలు చేస్తూ..స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. రీసెంట్ గా ఈయన హీరోగా నటించిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. కని విని ఎరుగని రీతిలో బన్నీ కెరీర్ లోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డ్ నెలకొల్పింది . ఈ సినిమా తో అల్లు అర్జున్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. బడా బడా బాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా ఈయనతో నటించడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు.

అయితే..త్వరలోనే పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ కానుంది. దీంతో అల్లు ఫ్యామిలీ అర్జున్ జాతకానీ మహా పండితులకు చూయించారట. ఈ క్రమంలో ప్రముఖ జ్యోతీష్య పండితులు షాకింగ్ విషయాలు బయటపెట్టిన్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. అల్లు అర్జున్ జాతకం అంతా బాగానే ఉంది కానీ..రానున్న రెండు మూడు సంవత్సరాల్లు ఆయనకు టైం బ్యాడ్ నడుస్తుందని..ఆరోగ్య పరంగా బాధపడుతారని..మనశాంతి ఉండదని..దీనికి పరిహారంగా అల్లు అర్జున్ కొన్ని ప్రత్యేకమైన పూజలు, హోమాలు..యజ్ఞయాగాలు చేస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయని జ్యోతిష్యలు సలహాలు ఇచ్చినట్లు సమాచారం.

నిజానికి బన్నీ ఇలాంటివి పెద్దగా నమ్మడట..కానీ వాళ్ళ అమ్మగారు, స్నేహా రెడ్డి పట్టుబట్టి అల్లు అర్జున్ చేత ఈ పూజలు చేయడానికి ఓప్పించారట. పుష్ప 2 సినిమా షూటింగ్ ని ప్రారంభించే లోపే ఈ పూజలు హోమాలు అన్ని కంప్లీట్ అయ్యేలా బన్నీ ప్లాన్ చేసుకోబోతున్నారట. అల్లు అర్జున్ తన ఫామ్ హౌస్ లో ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నట్లు సోషల్ మీడియా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ జ్యోతిష్యుల ఆధ్వర్యంలో ఈ హోమం జరగబోతున్నట్లు సమాచారం. మరి చూడాలి ఈ పూజలు తరువాత బన్నీ కెరీర్ ఎలా ఉందబోతుందో..?


Leave a Reply

*