‘భీమ్లానాయ‌క్‌’ రివ్యూ &రేటింగ్

టైటిల్‌: భీమ్లానాయ‌క్‌
బ్యాన‌ర్‌: సితారా ఎంట‌ర్టైన్‌మెంట్‌
న‌టీన‌టులు: ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – ద‌గ్గుబాటి రానా – నిత్యామీన‌న్ – సంయుక్త మీన‌న్ త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ: ర‌వి కె. చంద్ర‌న్‌
ఎడిటింగ్‌: న‌వీన్ నూలీ
మ్యూజిక్‌: థ‌మ‌న్‌. ఎస్‌
నిర్మాత‌: సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ
స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌లు: త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌
ద‌ర్శ‌క‌త్వం: సాగ‌ర్ కె. చంద్ర‌
రిలీజ్ డేట్‌: 25 ఫిబ్ర‌వ‌రి, 2022

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రానా ద‌గ్గుబాటి క‌ల‌యిక‌లో సితార ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య దేవ‌ర‌నాగ‌వంశీ నిర్మించిన సినిమా భీమ్లానాయ‌క్‌. మ‌ల్లూవుడ్‌లో హిట్ అయిన అయ్య‌ప్ప‌నుం కోషియ‌మ్ సినిమాకు రీమేక్‌గా వ‌చ్చిన ఈ సినిమాకు సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌కుడు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సంభాష‌ణ‌లు, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాపై ప‌వ‌న్ అభిమానుల్లోనే కాకుండా తెలుగు సినిమా అభిమానుల్లోనూ భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ భీమ్లానాయ‌క్ ఎలా ? ఉందో ? చూద్దాం.

స్టోరీ:
ఒక అగ్రెసివ్ పోలీస్ ఆఫీస‌ర్ భీమ్లానాయ‌క్ (ప‌వ‌న్ క‌ళ్యాణ్‌)కు ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీస‌ర్ డానియ‌ల్ శేఖ‌ర్ (రానా)కు మ‌ధ్య అహంకారం, ఆత్మాభిమానం మ‌ధ్య జ‌రిగే ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధ‌మే ఈ సినిమా క‌థ‌. భీమ్లానాయ‌క్ స్ట్రిక్ట్ రూల్స్ వ‌ల్ల డానియేల్ శేఖ‌ర్ అడుగ‌డుగునా ఇబ్బందుల్లో ప‌డుతూ ఉంటాడు. చివ‌ర‌కు భీమ్లా శేఖ‌ర్‌ను జైలుకు పంపుతాడు. అయితే భీమ్లాకు శేఖ‌ర్ మాజీ ఆర్మీ ఆఫీస‌ర్ అని, అత‌డు ఓ పెద్ద పొలిటిక‌ల్ లీడ‌ర్ (స‌ముద్ర‌ఖ‌ని) కొడుకు అన్న విష‌యం తెలియ‌దు. ఆ త‌ర్వాత భీమ్లా సారీ చెప్పినా అత‌డు త‌న పొలిటిక‌ల్ ప‌లుకుబ‌డితో భీమ్లా ఉద్యోగం కోల్పోయేలా చేస్తాడు. అలా వీరిద్ద‌రు పంతాల‌కు పోయి చివ‌ర‌కు ఒక‌రినొక‌రు చంపుకునే వ‌ర‌కు వెళ‌తారు ? ఈ యుద్ధంలో నాయ‌క్ భార్య ( నిత్యామీన‌న్‌), శేఖ‌ర్ తండ్రి స‌ముద్ర‌ఖ‌ని ప్రమేయంతో ఈ క‌థ ఎలా మ‌లుపులు తిరిగి ఎలా ముగిసింది ? అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

విశ్లేష‌ణ‌:
ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అద్భుత‌మైన పాత్ర‌లో క‌నిపించాడు. సినిమా అంతా ఎన‌ర్జీతో ప‌వ‌న్ పాత్ర ట్రావెల్ అవుతుంది. ప‌వ‌న్ డైలాగ్ డెలివ‌రీ, అగ్రెసివ్ మ్యాన‌రిజ‌మ్స్ అన్నీ మాస్‌తో పాటు ప‌వ‌న్ అభిమానుల‌ను అల‌రిస్తాయి. ఇక ప‌వ‌న్‌తో పోటీ రానా కూడా అంతే అద్భుతంగా న‌టించాడు. ప‌వ‌న్ – రానా పోటీ న‌ట‌న స్క్రీన్ మీద చూస్తున్న‌ప్పుడు వావ్ అన‌కుండా ఉండ‌లేం. ఇక మిగిలిన వారిలో నిత్యా మీనన్ ప‌వ‌న్ భార్య‌గా ప‌వ‌న్ క్యారెక్ట‌ర్ విష‌యంలో చాలా న‌మ్మ‌కం ఉండే పాత్ర చేసింది. మిగిలిన వారిలో సంయుక్త మీన‌న్‌, మురళీ శర్మ, రావు రమేష్ తమ పాత్రలను చక్కగా పోషించారు.

ఇక త్రివిక్ర‌మ్ క‌థ‌నంలో ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌తో పోలిస్తే కొన్ని మార్పులు చేశాడు. ఇంకా చెప్పాలంటే ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌తో పోలిస్తే స్క్రీన్ ప్లే బాగా మార్చాడు. అయ్యప్పనుం కోషియం సినిమా కంటే భీమ్లా నాయక్‌లో మాస్ అప్పీల్ ఎక్కువ. ఇక త్రివిక్ర‌మ్ స్వ‌యంగా మాట‌లు స‌మ‌కూర్చ‌డంతో ఆ మాట‌ల తీవ్ర‌త‌, ప‌దును బాగా ఉంది. ఇక థ‌మ‌న్ నేప‌థ్య సంగీతం చంపేశాడు. ట్రైల‌ర్లో డిజ‌ప్పాయింట్ అయిన వారంద‌రూ సినిమాల్లో సీన్ల‌కు త‌గిన‌ట్టుగా థ‌మ‌న్ సంగీతం ఎంజాయ్ చేస్తారు.

పాట‌లు క్వాలిటీతో ఉన్నాయి. సినిమాటోగ్ర‌ఫీ వంక‌పెట్ట‌లేం.. విజువ‌ల్స్ రిచ్‌గా ఉన్నాయి. ఇక సూర్య‌దేవ‌ర నాగ‌వంవీ నిర్మాణ విలువ‌లు సూప‌ర్బ్‌. ద‌ర్శ‌కుడు సాగ‌ర్ చంద్ర ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌తో కంపేరిజ‌న్ చేసి చూస్తే ఈ రీమేక్‌ను బాగా తెర‌కెక్కించాడు. త్రివిక్ర‌మ్ ఇచ్చిన స్క్రీన్ ప్లేను మాస్ వెర్ష‌న్‌లో ప్లే చేశాడు. సినిమా ఫ‌స్టాఫ్ అంతా భీమ్లా నాయక్ డీసెంట్‌గా అనిపించింది. ప్రధాన పాత్రధారుల మధ్య వచ్చే ఘర్షణ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. డైలాగ్స్ కూడా బాగున్నాయి.

ఇక సెకండాఫ్‌లో భీమ్లా భార్య‌ను స‌ముద్ర‌ఖ‌ని టార్గెట్ చేయ‌డం, సీరియ‌స్ ప్లాష్‌బ్యాక్, భీమ్లా నాయక్ మరియు డేనియల్ శేఖర్ మధ్య టగ్ ఆఫ్ వార్ తీవ్రమవ్వ‌డం లాంటి సీన్లు ఆస‌క్తి రేకెత్తించాయి.

ప్ల‌స్ పాయింట్స్ (+) :
– పవన్ కళ్యాణ్ మరియు రానాల నటన
– ప్రీ ఇంటర్వెల్ – ప్రీ క్లైమాక్స్ లో డైలాగ్స్
– బీజీఎం
– సెకండాఫ్ మరియు క్లైమాక్స్
– సెకండాఫ్ లో యాక్షన్ సీక్వెన్సులు

మైన‌స్‌ పాయింట్స్ (+) :
– ఫస్ట్ హాఫ్ స్లో
– కొన్ని సాంగ్స్ పిక్చ‌రైజేష‌న్‌
– కొన్ని చోట్ల స్లో నెరేష‌న్‌
– కొరియోగ్రఫీ

ఫైన‌ల్గా…
ఓవరాల్‌గా భీమ్లా నాయక్‌ మంచి సినిమా. ఫ‌స్టాఫ్ కంటే సెకండ్ హాప్ బాగుంది. ప‌వ‌న్ – రానా పోటాపోటీ న‌ట‌న‌, థ‌మ‌న్ సంగీతం… సినిమాకు తెలుగు నేటివిటికి అనుగుణంగా మార్చిన త్రివిక్ర‌మ్ సెన్సిబులిటీ ఇవ‌న్నీ సినిమాను హిట్ చేశాయి. భీమ్లానాయ‌క్ ప‌వ‌న్ అభిమానుల‌కు సూప‌ర్ హిట్ అయితే.. జ‌న‌ర‌ల్ ఆడియెన్స్‌కు బొమ్మ హిట్టే…!

భీమ్లానాయ‌క్ TJ రేటింగ్‌: 3.25 / 5

Share post:

Latest