ఒకే కథ.. రెండు సినిమాలు సూపర్ హిట్..!

ప్యార్‌ జుక్తా నహీ.. అప్పట్లో బాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న సినిమా. మిథున్‌ చక్రవర్తి, పద్మినీ కొల్హాపురి హీరో, హీరోయిన్లుగా నటించారు. కె.సి.బొకాడియా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా రీమేక్ రైట్స్.. నిర్మాత అట్లూరి పూర్ణ చంద్ర రావు తీసుకున్నాడు. శోభన్ బాబుతో ఈ సినిమా చేయాలి అనుకున్నాడు. అటు క్రిష్ణ, శ్రీదేవితో కలిసి మిద్దె రామారావు ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. కొన్ని సీన్లతో పాటు పాటలు కూడా షూట్ చేశాడు. అయితే ఈ సినిమా అనుకున్నట్లు రావడం లేదని షూటింగ్ ఆపేశారు.

- Advertisement -

మరో కొత్త కథతో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాలి అనుకున్నారు. అదే సమయంలో నిర్మాత మిద్దె రామారావు దృష్టికి ప్యార్‌ జుక్తా నహీ మూవీ వచ్చింది. ఆ సమయంలోనే ఈ సినిమా రైట్స్ తనకు ఇవ్వమని.. ఈ సినిమాను కృష్ణతో తీస్తానని చెప్పాడు. అందుకు అట్లూరి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత కృష్ణకు హిందీ సినిమా చూపించారు. తను ఓకే చెప్పడంతో తెలుగలో పచ్చని కాపురం అనే పేరుతో తెరకెక్కించారు.

వాస్తవానికి ఇదే కథతో శోభన్‌బాబు, విజయశాంతి జంటగా శ్రీవారు పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. కానీ మూడు షెడ్యూల్స్ అయిపోయాక నిర్మాత మిద్దె రామారావుకు, దర్శకుడు తాతినేని రామారావుకు తెలిసింది. అప్పటికి ప్యాచ్‌వర్క్‌ మాత్రమే మిగిలి ఉంది. ఈ విషయం తెలిసి దర్శకుడు రామారావులో టెన్షన్‌ ఏర్పడింది. ఒకే కథతో రెండు సినిమాలు ఒకే రోజున విడుదలైతే ఇన్నాళ్లూ తాము పడిన శ్రమ వేస్ట్ అవుతుంది అనుకున్నాడు. అందుకే వారం రోజుల పాటు బాగా కష్టపడి సినిమాకు సంబంధించిన ఫస్ట్ కాపీ తెచ్చారు. రిలీజ్ డేట్ ప్రకటించారు. పచ్చని కాపురం మూవీ తొలుత విడుదల అయ్యింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రెండు వారాలకు శ్రీవారు విడుదల అయ్యింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

Share post:

Popular